Ads

Showing posts with label Lord Shiva. Show all posts
Showing posts with label Lord Shiva. Show all posts

10 March, 2021

శివ ప్రాత: స్మరణ స్తోత్రం!


శివ ప్రాత: స్మరణ స్తోత్రం!

ప్రొద్దున్న మనం లేవగానే భగవంతుడిని తలచుకోగలగటం ఒక వరం.. రోజులో మొదటగా, భగవన్నామ జపంతో రోజుని మొదలుపెట్టడమే ప్రాత: స్మరణ..

[ శివపరివారం 8 భాగాలు చూడండి: https://bit.ly/2CsoLBT ]

శివ ప్రాత: స్మరణ మంత్రాన్ని రోజూ పొద్దున్నే చదివి, శివుణ్ణి మనసారా ధ్యానించి రోజుని మొదలుపెట్టడం శుభప్రదం. ఇలా రోజూ ఈ స్తోత్రాన్ని చదివితే, జనన మరణ భయాలు లేక, ఆ సదాశివుడే మనల్ని కాపాడతాడనే ధైర్యంతో, భయాలనుండి విముక్తులమవ్వగలం..  తెలుగులో అర్ధాన్ని చదివి స్తోత్ర పరమార్థం తెలుసుకోండి.. 

శివ ప్రాత: స్మరణ స్తోత్రం, తాత్పర్యం..

1. ప్రాత:స్మరామి భవభీతిహరం సురేశం

    గంగాధరం వృషభవాహన మంబికేశం

    ఖటాంగశూల వరదాభయ హ సమీశం

    సంసార రోగహర మౌషధ మద్వితీయమ్||

జనన మరణ బాధలనుండి రక్షించే సదా శివుడికి నమస్కారం.. ఆయన గంగా ధరుడు, వృషభ వాహనుడు, అంబికా నాధుడు.. వరాలని కురిపించే ఆయన అభయ హస్తాలతో, ఆయన ఖట్వాంగాన్నీ, త్రిశూలాన్నీ ధరించిన ఆ మహా శివుడిని ధ్యానించటమే, ఈ సంసార జీవితంలోని చికాకులకు, సరియైన పరిష్కారం..

2. ప్రాతర్నమామి గిరీశం గిరిజార్ధదేహం

    సర్గస్థితి ప్రళయకారణ మాదిదేవం

    విశ్వేశ్వర విజిత విశ్వమనోభిరామం

    సంసార రోగహర మౌషధ మద్వితీయం ||

అర్ధ దేహాన్ని భార్యతో పంచుకున్న సదా శివుడికి నమస్కారం.. సృష్టికీ, స్థితికీ, లయకీ కారణమైన వాడూ, ఈ జగత్తు ప్రారంభానికన్నా ముందునుండీ ఉన్నవాడూ, ఈ సృష్టిని నడిపేవాడూ, నాశనం చేయగలవాడూ అయిన ఆ మహా శివుడిని ధ్యానించటమే, ఈ సంసార జీవితంలోని చికాకులకు సరియైన పరిష్కారం..

3. ప్రాతర్భజామి శివమేక మనంతమాద్యం

    వేదాంత వేద్యమనఘం పురుషం మహంతామ్

    నామాది భేదరహితం షడ్భావశూన్యం

    సంసార రోగహర మౌషధ మద్వితీయమ్||

ఆదీ అంతం లేని వాడూ, వేదాల సారము అయినవాడూ, పాపాలను హరించే వాడూ, ఏ పేరుతో కొలచినా భేద భావములు చూపక, భక్తులందరి కోరికలు తీర్చేవాడూ అయిన ఆ మహా శివుడిని ధ్యానించటమే, ఈ సంసార జీవితంలోని చికాకులకు సరియైన పరిష్కారం..

4. ప్రాత:సముత్థాయ శివం విచింత్య 

    శ్లోకత్రయం యే సుదినం పఠంతి

    తే దు:ఖజాతం బహుజన్మ సంచితం 

    హిత్వాపదం యాంతి తదేవశంభో:|| 

రోజూ ప్రొద్దున్నే ఎవరయితే శివుడిని ధ్యానించి, పై మూడు శ్లోకాలనీ చదువుతారో, వారు జన్మ జన్మల కర్మఫలం నుండి విముక్తులై, శివ సాన్నిధ్యానికి చేరుతారు.. శుభం భూయాత్!

Link: https://www.youtube.com/post/UgykQjA7-rS70ez6GeB4AaABCQ