శివ ప్రాత: స్మరణ స్తోత్రం!
ప్రొద్దున్న మనం లేవగానే భగవంతుడిని తలచుకోగలగటం ఒక వరం.. రోజులో మొదటగా, భగవన్నామ జపంతో రోజుని మొదలుపెట్టడమే ప్రాత: స్మరణ..
[ శివపరివారం 8 భాగాలు చూడండి: https://bit.ly/2CsoLBT ]
శివ ప్రాత: స్మరణ మంత్రాన్ని రోజూ పొద్దున్నే చదివి, శివుణ్ణి మనసారా ధ్యానించి రోజుని మొదలుపెట్టడం శుభప్రదం. ఇలా రోజూ ఈ స్తోత్రాన్ని చదివితే, జనన మరణ భయాలు లేక, ఆ సదాశివుడే మనల్ని కాపాడతాడనే ధైర్యంతో, భయాలనుండి విముక్తులమవ్వగలం.. తెలుగులో అర్ధాన్ని చదివి స్తోత్ర పరమార్థం తెలుసుకోండి..
శివ ప్రాత: స్మరణ స్తోత్రం, తాత్పర్యం..
1. ప్రాత:స్మరామి భవభీతిహరం సురేశం
గంగాధరం వృషభవాహన మంబికేశం
ఖటాంగశూల వరదాభయ హ సమీశం
సంసార రోగహర మౌషధ మద్వితీయమ్||
జనన మరణ బాధలనుండి రక్షించే సదా శివుడికి నమస్కారం.. ఆయన గంగా ధరుడు, వృషభ వాహనుడు, అంబికా నాధుడు.. వరాలని కురిపించే ఆయన అభయ హస్తాలతో, ఆయన ఖట్వాంగాన్నీ, త్రిశూలాన్నీ ధరించిన ఆ మహా శివుడిని ధ్యానించటమే, ఈ సంసార జీవితంలోని చికాకులకు, సరియైన పరిష్కారం..
2. ప్రాతర్నమామి గిరీశం గిరిజార్ధదేహం
సర్గస్థితి ప్రళయకారణ మాదిదేవం
విశ్వేశ్వర విజిత విశ్వమనోభిరామం
సంసార రోగహర మౌషధ మద్వితీయం ||
అర్ధ దేహాన్ని భార్యతో పంచుకున్న సదా శివుడికి నమస్కారం.. సృష్టికీ, స్థితికీ, లయకీ కారణమైన వాడూ, ఈ జగత్తు ప్రారంభానికన్నా ముందునుండీ ఉన్నవాడూ, ఈ సృష్టిని నడిపేవాడూ, నాశనం చేయగలవాడూ అయిన ఆ మహా శివుడిని ధ్యానించటమే, ఈ సంసార జీవితంలోని చికాకులకు సరియైన పరిష్కారం..
3. ప్రాతర్భజామి శివమేక మనంతమాద్యం
వేదాంత వేద్యమనఘం పురుషం మహంతామ్
నామాది భేదరహితం షడ్భావశూన్యం
సంసార రోగహర మౌషధ మద్వితీయమ్||
ఆదీ అంతం లేని వాడూ, వేదాల సారము అయినవాడూ, పాపాలను హరించే వాడూ, ఏ పేరుతో కొలచినా భేద భావములు చూపక, భక్తులందరి కోరికలు తీర్చేవాడూ అయిన ఆ మహా శివుడిని ధ్యానించటమే, ఈ సంసార జీవితంలోని చికాకులకు సరియైన పరిష్కారం..
4. ప్రాత:సముత్థాయ శివం విచింత్య
శ్లోకత్రయం యే సుదినం పఠంతి
తే దు:ఖజాతం బహుజన్మ సంచితం
హిత్వాపదం యాంతి తదేవశంభో:||
రోజూ ప్రొద్దున్నే ఎవరయితే శివుడిని ధ్యానించి, పై మూడు శ్లోకాలనీ చదువుతారో, వారు జన్మ జన్మల కర్మఫలం నుండి విముక్తులై, శివ సాన్నిధ్యానికి చేరుతారు.. శుభం భూయాత్!
Link: https://www.youtube.com/post/UgykQjA7-rS70ez6GeB4AaABCQ