Ads

Showing posts with label Moral Stories. Show all posts
Showing posts with label Moral Stories. Show all posts

09 January, 2021

పెద్దలను అర్ధం చేసుకోండి! చిన్న‌ సంఘటన.. Moral Story


పెద్దలను అర్ధం చేసుకోండి! చిన్న‌ సంఘటన..

పూర్వము, భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనం లోనే, కవిత్వం చెప్పేవాడు, కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా అతనిని చాలా మెచ్చుకునేవారు. భారవి తండ్రితో, నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు. ఆయన  మాత్రం, వాడింకా చిన్నవాడు.. యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది.. ఏదో వ్రాస్తాడులే, అనేవాడు.

భారవికి, తండ్రి తనను మెచ్చుకోవడం లేదని, చాలా అసంతృప్తి. తల్లి దగ్గర, 'నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు. వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే, తనేమో, ఏమున్నది? యింకా వాడు చిన్నవాడు.. అన్నట్లు మాట్లాడుతారు..' అని చాలా సార్లు చెప్పుకున్నాడు.

ఎన్నాళ్ళయినా, తండ్రి ధోరణి మారక పోయే సరికి, భారవికి  తండ్రిమీద కసి పుట్టింది.. ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి, ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు.. భార్య వడ్డిస్తూ వుంది. భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే, చంపెయ్యాలని, పెద్ద బండరాయి పట్టుకుని, పెరట్లో ఒక పక్క కాచుకుని కూర్చున్నాడు.

అప్పుడు భారవి తల్లి, భర్తతో.. 'మీరెందుకు వాడిని అస్తమానం, చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు? వాడు చాలా బాధ పడుతున్నాడు. వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే, మీరు మాత్రం, వాడికేమీ తెలీదని అంటారట!'.. అప్పుడు తండ్రి నవ్వి.. 'పిచ్చి దానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగడితే, బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా, పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి, గర్వం పెరిగి, తనంతటి వాడు లేడని, విర్రవీగుతాడు.. దానితో, వాడి అభివృద్ధి ఆగిపోదా?' అన్నాడు..

వారి సంభాషణ విని, భారవికి బుర్ర తిరిగి పోయింది. పశ్చాత్తాపంతో రగిలి పోయాడు.. వెంటనే బండ అక్కడ పారవేసి, లోపలికి వెళ్లి, తండ్రి పాదాలమీద పడి, భోరున ఏడ్చాడు. తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి, తనకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.

'పశ్చాత్తాపంతో, నీపాపం పోయింది! శిక్ష ఎందుకు?' అని తండ్రి చెబుతున్నా వినకుండా, తనకు శిక్ష వేయమని, పట్టు బట్టాడు. తండ్రి, 'సరే.. అలాగయితే, మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం, ఎవరికీ.. చివరికి నీ భార్యకు కూడా, ఎందుకు? ఏమిటి? ఏ కారణాలూ చెప్పకుండా, అక్కడ‌వుండి రా!' అన్నాడు.. 'ఇంత చిన్న శిక్షా?' అన్నాడు భారవి. తండ్రి నవ్వి, 'అది చాల్లే వెళ్ళు' అన్నాడు.

భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా, భారవి భార్య కాపురానికి రాలేదు. సరేనని, భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.‌ వాళ్ళు అల్లుడుగారు వచ్చారని, చాలా మర్యాద చేశారు. రోజుకో పిండి వంట చేసి, ఆదరించారు. నెల రోజులు గడుస్తున్నా, 'అల్లుడు వెళ్ళటం లేదేమని?' వాళ్ళు విసుక్కున్నారు..

చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు, పొలం పనులు కూడా పురమాయించారు. అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు.. దేనికీ బదులు చెప్పకుండా, విసుక్కోకుండా, అన్ని పనులూ చేసేవాడు. అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు, చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ, 'మీరు మీ ఊరు వెళ్లిపోండ'ని  యెంతో చెప్పి చూసింది..

భారవి సమాధానం చెప్పకుండా, మౌనం వహించే వాడు. ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి, 'యింక నేను మావూరికి పోయివస్తాను' అని బయలు దేరాడు.. ఇంత హఠాత్తుగా, ఎందుకు వెళ్లాలని అంటున్నాడో, వాళ్లకు అర్థం కాలేదు. భార్యకూ, అత్త మామలకూ విషయం వివరించి, 'నా శిక్ష పూర్తయ్యింది.. అందుకని వెళుతున్నాను' అని చెప్పాడు.

ఇది విని, వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు. భారవి, తన తండ్రి వేసిన శిక్ష, తనలో ఎంతో ఓర్పునూ, నేర్పునూ, సహనాన్నీ, అవగాహననూ పెంచాయని గ్రహించాడు. 

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో, ఆయనే ప్రథముడు. 

చిన్నప్పుడు తల్లి కోప్పడిందనీ, తండ్రి దండించాడనీ, వారి మీద కోపం పెంచుకోకండి! అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని, గుర్తు పెట్టుకోండి!

తల్లిదండ్రులను ద్వేషించకండి! అంతకంటే పాపం ఇంకోటి వుండదు..

Manchimata Videos:

[ స్నేహ బంధం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/v5BseWhhnPM ]

[ అమృత హస్తం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/RZ2Q8KqiXYc ]

[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]

[ మనిషికుండవలసిన లక్ష్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]

[ మనిషికుండే నిరాశ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]

[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]

[ కదిలిపోయేదే కాలం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/9kQuLJAe4-A ]

[ నవరసభరితం - నరుడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/HKkTaHJflj8 ]

[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]

[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]

[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]

[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]

[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]

[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/JFLTERF-L2w ]

[ మనిషి జయించవలసిన '6 దోషాలు' – విదుర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/vu76U3f7LJ4 ]