Ads

Showing posts with label Facts Behind the Suppressed History of Porus. Show all posts
Showing posts with label Facts Behind the Suppressed History of Porus. Show all posts

06 April, 2019

Full Script of 'Facts Behind the Suppressed History of Porus!' Video of 'M Planet Leaf'

This will be useful for practicing purpose for upcoming Telugu voice over artistes. You can take a print of this script and watch the video to practice the Expression, Punctuation, Modulation and Pronunciation. All the best... Maheedhar Vallabhaneni



అలెగ్జాండర్ పురుషోత్తముణ్ణి నిజంగా గెలిచాడా? MPL

Facts Behind the Suppressed History of Porus!


నమస్తే, మహీధర్స్ ప్లానేట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం...

ఈ వీడియో ప్రతి ఒక్క భారతీయుడూ తప్పక చూడాలి. మొత్తం చూసినతరువాత, మీకనిపించిన నిజమేమిటో, కామెంట్స్ లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మనం చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్న చరిత్ర ప్రకారం, సా.శ.పూ 326లో, మాసిడోనియా ప్రభువైన అలెగ్జాండర్, ఇప్పటి పంజాబ రాష్త్రంలోని జీలం నది వొడ్డున పురుషోత్తముడ్ని ఓడించాడనీ, కానీ ఓడిపోయినా, పురుషోత్తముడి పరాక్రమానికి మెచ్చి, గొప్ప ఔదార్యం గల నీతిమంతుడిగా అలెగ్జాండర్, అతని రాజ్యం అతనికి తిరిగి ఇచ్చివేశాడనీ, ఇప్పటికీ మనందరం యెంతో అమాయకంగా నమ్ముతున్నాము! ఈ అలెగ్జాండర్ దండయాత్ర, భారతదేశపు చరిత్రలో అతి ముఖ్యమైనదిగా కూడా మన చరిత్రకారులు వర్ణించారు! కానీ, భారతదేశంలో కూడా, అంతకు ముందే మహాజనపదాల పేరుతో, 16 విస్తారమైన సామ్రాజ్యాలు ఉన్నాయి. ప్రతి సామ్రాజ్యంలోనూ, తమ ప్రభువు యొక్క విజయ పరంపరలని గానం చెస్తూ, కావ్యాలు రాయడం జరిగింది. ప్రతి రాజ్యానికీ, తన సొంత కరెన్సీ ఉండేది. చరిత్ర రచన శిలా శాసనాల రూపంలో కూడా చేశారు. కానీ, ఇప్పుడు మనం ఇంత ప్రముఖమైనదిగా చెప్పుకుంటున్న సంఘటన గురించి, అసలు యే ప్రస్తావనా లేదు. యెందుకని? మన పురాణాలు 18కావటం కాకతాళీయం కాదు. ఆ పురాణాలలో,ఆధ్యాత్మిక విషయాలు లేవు. ఆ పురాణాలలో,ఆయా రాజవంశాల చరిత్ర రచించబడింది!

అలెగ్జాండర్, పురుషోత్తముల మధ్య జరిగిన యుధ్ధానికి సంబంధించి,మనం చదివిన విషయాలకు ఆధారాలు గ్రీకుల చరిత్రలో కన్నా, ఆంగ్లేయులైన ఆధునిక చరిత్రకారుల ఉల్లేఖనాల నుంచే లభిస్తున్నాయి. కారణం యేమిటి? భారతదేశపు ప్రాచీన చరిత్రలో,అలెగ్జాండర్ ని పురుషోత్తముడు ఓడించాడని చెప్పబడింది. గ్రీకు చరిత్రలో అలెగ్జాండర్, పురుషోత్తముణ్ణి ఓడించాడని చెప్పబడింది! గ్రీసు దేశపు చరిత్రకారులు, ఒక గ్రీకు ప్రభువు విదేశీ రాజు చేతిలో ఓడిపోయాడని రాసుకుంటారా? గ్రీకు ప్రభువు ఇతర్లని జయించాడని రాసుకుంటారా? భారత దేశపు చరిత్రకారులు, ఒక భారత ప్రభువు విదేశీ రాజు చేతిలో ఓడిపోయాడని రాసుకుంటారా? భారత ప్రభువు ఇతర్లని జయించాడని రాసుకుంటారా? బ్రిటిష్ చరిత్రకారులు మాత్రమే ఇతన్ని విశ్వవిజేతగా నిలబెట్టాలని చూశారు! గ్రీకుల వైపు నుంచి అలెగ్జాండర్ తప్ప, ఇంకెవరూ భారతదేశాన్ని గెలవాలనే ఉద్దేశంలో లేరు. వారి ముఖ్యశత్రువు పర్షియా. దాన్ని గెలిచారు. అందుకే ఇక ముందుకు వెళ్ళడానికి వ్యతిరేకించారు.! బ్రిటిష్ చరిత్రకారుల కల్పనాత్మక విశ్లేషణయే తప్ప, అలెగ్జాండర్ కి సైతం, ప్రపంచవిజేత కావాలనే కోరిక ఉన్నదనే గట్టి సాక్ష్యాలు లేవు.

ఆ కాలంలో పురుషోత్తముడి రాజ్యం చాలా చిన్నది. భౌగోళికంగా విదేశీయులు భారతదేశానికి ప్రవేశించే కీలకమైన చోట ఉన్నది. అంతే! ఈ పురుషోత్తముడి గురించి, ప్రముఖ రాజవంశాల చరిత్రలలో గానీ, ఇతర ప్రస్తావనలలో గానీ పేర్కొన లేదు. మహా జనపదాలలో ఉన్న అనేకానేక సామంత రాజ్యాల మాదిరిగానే, యేదో ఒక రాజ్యానికి సామంతుడై ఉండవచ్చు. ఈ యుధ్ధం ప్రస్తావనలో మాత్రమే, ఇతని పేరు కనబడుతున్నది! మనం చదువుకుంటున్న ఇవ్వాల్టి చరిత్రకారులు చెప్తున్నట్టు,భారతదేశపు చరిత్రలో కల్లా, అతి ముఖ్యమైన సంఘటన కూడా కాదు ఆనాటి వాళ్ళకి. ఈ యుధ్ధంలో అలెగ్జాండర్, పురుషోత్తముడి చేతిలో ఓడిపోవటమే, భారతదేశపు చరిత్రలో ప్రముఖంగా పేర్కొనబడక పోవటానికి కారణం - అప్రధానమైన విషయాలు, చరిత్ర రచనలోకి యెక్కిస్తారా యెవరైనా? వచ్చాడు, ఓడాడు, వెళ్ళాడు - అంతకన్నా అధ్భుతం జరగలేదు!

యుధ్ధంలో పురుషోత్తముడే గెలిచాడనేటందుకు, తటస్థులు కొందరు ఉదహరించిన చారిత్రక వాస్తవాల కన్నా, ముందుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్న కధలోని వైరుధ్యాలని చెబుతాను. పురుషోత్తముణ్ణి ఓడించి, ఆ రాజ్యాన్ని తనకివ్వమని, అలెగ్జాండర్ తో ఒప్పందం కుదుర్చుకున్న తక్షశిల రాజు అంబి మీకు గుర్తున్నాడనుకుంటాను! సహజంగా అలెగ్జాండర్ తో విజయయాత్రకి బయలుదేరిన ఇతరులు, ప్రాధమిక లక్ష్యమైన పర్షియా మీద గెలుపుతో వెనక్కి తిరగాలని అనుకోవటం వల్ల, అలెగ్జాండర్ కూడా ఇక వెనక్కి వెళ్ళిపోయే వాడో యేమో గానీ, అంబి తో ఒప్పందం ఖరారు చేసుకోవడం వల్లనే, అతను పురుషోత్తముడి రాజ్యం మీదకి వచ్చాడని స్పష్తంగా తెలుస్తున్నది గదా! మరి, గెలిచాక పురుషోత్తముడు యెంత వీరోచితంగా పోరాడినా, అంబి తో తను చేసుకున్న ఒప్పందాన్ని భగ్నం చేసేటంత అమర్యాదకరమైన పని యెందుకు చేస్తాడు? ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది!

యుధ్ధం తర్వాత పురుషోత్తముడికి తన సొంత రాజ్యం మాత్రమే దక్కలేదు, అంబి రాజ్యం కూడా కలిసింది - మరి ఇదేం వింత? గొప్ప పధకం వేసి, నది దాటి, చుట్టూ తిరిగి వచ్చి, వెనకనుంచి దాడి చేసి యుధ్ధంలో గెలిచిన వాడు, తన చేతిలో ఓడిపోయిన వాడికితను యేవరితోనైతే గెలిచాక పురుషోత్తముడి రాజ్యాన్ని ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడో, ఆ రాజ్యాన్ని కూడా ఓడిపోయిన రాజుకి దఖలు పర్చేశాడట!

Marshal Gregory Zhukov అనే రష్యన్ యుధ్ధనీతి విశారధుడు, ఈ యుధ్ధాన్ని గురించి ప్రస్తావిస్తూ, అలెగ్జాండర్ నేతృత్వంలో మాసిడోనియన్లు, భరతఖండంలో జరిగిన యుధ్ధంలో, దారుణంగా పరాజితులయ్యారని ప్రస్తావించాడు!

Following Alexander’s failure to gain a position in India and the defeat of his successor Seleucus Nicator, relationships between the Indians and the Greeks and the Romans later, was mainly through trade and diplomacy. Also the Greeks and other ancient people did not see themselves as in any way superior, only different.”

 ఇదీ అతను నిష్కర్షగా తేల్చి చెప్పిన విషయం. ఇంకా అనుమానంగా ఉందా? అలెగ్జాండర్ యుధ్ధంలో ఓడిపోతేనే, అంబి రాజ్యాన్ని కూడా పురుషోత్తముడికే దఖలు పర్చడం, తార్కికంగా సరయినది అవుతుంది! ఆ యుధ్ధంలో తగిలిన గాయాలతోనూ, ఆ ఓటమి వల్ల కలిగిన మనోవ్యధతోనూ మరణించడం జరిగిందనేది, యదార్ధంగా తోస్తున్నది! యెన్ని అబధ్ధాలు? యెంత కపటం? అంతా వక్రీకరణలూ, పులుముడు వ్యాఖ్యానాలూ

ఈ మొత్తం కట్టుకధలో ప్రస్తావించబడిన నలుగురు వ్యక్తుల కాలాలు ఇలా ఉన్నాయి: సాండ్రకోట్టస్ పేరుతో, మగధ రాజుని వ్యవహరించారు. మన దేశపు చరిత్రలో, చంద్రగుప్తుడనే పేరుతో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు, సా.శ.పూ 320 లో జీవించి ఉండి, భారతదేశ చరిత్రలో స్వర్ణయుగాన్ని సృష్టించినదిగా వర్ణించబడిన గుప్తవంశ స్థాపకుడైన గుప్తవంశపు చక్రవర్తి. మరొకరు, సా.శ.పూ 320లో,మౌర్యసామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడు. దండయాత్ర జరిగిందని చెప్పబడుతున్న కాలంలో, మగధను పాలిస్తున్నది నందవంశం! ఈ ఇద్దరు చంద్రగుప్తులలో, యే ఒక్కరికీ, ఆ యుధ్ధంతో సంబంధమే లేదు! అలెగ్జాండర్, ఇద్దరు చంద్రగుప్తులూ కాకుండా, ఆ కధలో వినబడుతున్న మరొక వ్యక్తి సెల్యూకస్ Nicator - అలెగ్జాండర్ సైన్యాధిపతులలో ఒకడు! పురుషోత్తముణ్ణీ గెలిచిన అలెగ్జాండర్, ఇతన్ని తన ప్రతినిధిగా నియమించాడని చెప్పారు. కానీ, అలెగ్జాండర్ తర్వాత, బాబిలోనియాతో కలిపి, అలెగ్జాండర్ రాజ్యాన్ని పరిపాలించి, సా.శ.పూ 305 నుంచి సా.శ.పూ 300 మధ్య రెండు సంవత్సరాల పాటు, అప్పుడు మగధ ప్రభువైన మౌర్య చంద్రగుప్తుడితో పోరాడి ఓడిపోయి, తన కూతురు హెలీనానిచ్చి వివాహం చేసి, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు! ఈ నలుగురికీ సంబంధించి, ఇప్పటి చరిత్రలో ఉన్న గందరగోళాన్ని పోగొట్టుకోవాలంటే, విశ్వనాధ సత్యనారాయణ గారు కూర్చిన, పురాణ వైర గ్రంధమాల వరుస కధల్లోని, చంద్రగుప్తుని స్వప్నం అనే ఐదవ కధనీ, హెలీనా అనే పదవ కధనీ చదివి తీరాలి!

చూశారుగా? ఈ వీడియోలో మీరు చూసినంతవరుకూ, Logical గా మీరేమనుకుంటున్నారో క్రింద కామెంట్స్ లో తెలియజేయగలరు.

జై హింద్

మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వొస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే, మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి. అలాగే, వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చెయ్యడం మర్చిపోకండి...

Ref: http://harikaalam.blogspot.com/2015/09/blog-post_10.html