ధర్మాచరణ!
మన మనస్సును ఎప్పుడూ, అలవాటు శాసిస్తుంది. భయంకర వ్యాధి కూడా, నిద్రలో మనని ఏ వేదనకూ గురిచేయనట్లే, మన చుట్టూ ఉన్న కష్టసుఖాలను, ధర్మాచరణ మనకు తెలియకుండా చేస్తుంది. అప్పుడు ఆ పరమాత్మ నిర్ణయానుసారం, ఈ దేహం కదులుతుంది..
[ విదుర నీతి! - మహాభారత కథలు = https://youtu.be/AGnQFCI51O0 ]
ధర్మాచరణలో, అన్నీ సద్గుణాలే ఉంటాయి. మన నుండి ఏ దుర్గుణం వ్యక్తమైనా, ధర్మాచరణ లోపించినట్లే. ద్వేషం, కోపం, అసూయ వంటి ఏ లక్షణాలూ లేనిస్థితిని, ధర్మాచరణ ప్రసాదిస్తుంది..
'ధర్మాచరణ - శరణాగతి' మనకి రెండు రెక్కలుగా ఉంటే, మన ఆధ్యాత్మిక ప్రయాణం, పక్షి ఎగిరినంత సులభంగా సాగిపోతుంది..
శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం.. కనుకనే, రామ నామ స్మరణ ద్వారా, మనకు ధర్మాచరణకు కావలసిన బలం వస్తుంది..
ధర్మాచరణ ద్వారా, సుఖదుఃఖాలు తెలియని స్థితి కలుగుతుంది..
రామనామంతో కష్టాలు తీరతాయనడంలోని ఆంతర్యం అదే..
ధర్మో రక్షతి రక్షితః
Link: https://www.youtube.com/post/Ugynk9eL4iS6R1Oasc14AaABCQ
No comments:
Post a Comment