Ads

09 March, 2021

ప్రజల్ప రాహిత్యం - మౌన సాధన!


ప్రజల్ప రాహిత్యం - మౌన సాధన!

మనిషి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, హీన స్థితి నుంచి, ఉన్నత స్థితికి చేరుకోవాలంటే కావలసిన తప్పనిసరి గుణమే, 'ప్రజల్ప రాహిత్యం'.. 

[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]

'ప్రజల్పం' అంటే, 'అసందర్బపు ప్రేలాపన', 'పనికిరాని మాటలు మాటలాడటం' అన్నమాట..

ప్రజల్ప సహితుడు ఎప్పుడూ నిర్వీర్యుడే..

ప్రజల్ప రహితుడు ఎప్పుడూ వీర్యుడే..

భోగ కామికిగానీ, మోక్షగామికిగానీ, 'ప్రజల్ప రాహిత్యం' అన్నది అనివార్యం..

ప్రజల్పం అన్నదానిని కట్టి పెట్టాలి..

ప్రజల్పమే మనిషిని తినివేసే కాన్సర్ వ్యాధి!

నోట్లోనుంచి ఒక్క అనవసరపు మాట కూడా రాకూడదు!

అప్పుడు బోలెడంత శక్తిని మనలో కూడగట్టుకోవడం జరుగుతుంది..

'ప్రజల్ప రాహిత్యం' అన్నది మౌలిక ఆధ్యాత్మిక సాధన..

'ప్రజల్ప రాహిత్యం' అన్నది 'శక్తిని పొదుపు చేయడం'..

వాక్ క్షేత్రం మీద సరియైన పట్టు సాధించాలి..

వాక్ క్షేత్రం సదా శాస్త్రీయంగా, కుదింపుగా ఉండాలి..

అలాగే, అందరూ విధిగా మౌన సాధన చేయాలి. రోజుకి కనీసం కొద్దిసేపైనా మౌనదీక్ష వహించాలి. మౌనం గురించి, మౌనంగా వుంటేనే తెలుసుకుంటాం. మౌనంలో అపారమైన శక్తి మనకు ఆదా అవుతుంది. మౌనదీక్ష చేసినప్పుడు తెలుస్తుంది, మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఎన్ని వృథా మాటలు మాట్లాడుతున్నామో..

ఆ విధంగా ఆదా చేయబడిన ప్రాణశక్తే, మన శారీరక, మానసిక పరిపుష్టికీ, బుద్ధి వికాసానికీ, ఆధ్యాత్మిక శుద్ధతకూ, ఆత్మ పరాకాష్టకూ, క్రమ క్రమంగా దోహదపడుతుంది.. సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgxZEL3zNqyHvqmKOqB4AaABCQ

No comments: