Ads

08 March, 2021

ప్రయాణంలో కార్య సిద్ధి!


ప్రయాణంలో కార్య సిద్ధి!

ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం, మంచిది కాదు. ప్రయాణాలు ఎప్పుడు, ఎలా చేయాలో, శాస్త్రాలు వివరించాయి. సుదూర ప్రయాణాలకు, సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. అలాగే, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించాలి. ముఖ్యంగా, దీర్ఘకాల ప్రయాణాలకూ, తీర్థయాత్రలు చేయటానికీ, అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం, మంచిది.

[ మన పురాణాలలో ప్రస్థావించబడిన 20 ప్రాచీన నగరాలు! = https://youtu.be/_0HDjECQ4ao ]

అలాగే శుక్ర, ఆది వారాలు, పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. గురువారం, దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్రలలో, ప్రయాణమే పెట్టుకోరాదు.

విదియ, తదియ రోజులల్లో కార్యసిద్ధి, పంచమినాడు శుభం. సప్తమినాడు ఆత్మారాముడు సంతృప్తి చెందేలా, అతిథి మర్యాదలు జరుగుతాయి. దశమిరోజు, ధనలాభం. ఏకాదశి కన్యాలాభం, అంతా సౌఖ్యం. త్రయోదశి శుభాలను తెస్తుంది.

ఇక శుక్ల పాడ్యమి, దుఃఖాన్ని కలిగిస్తుంది. చవితి నాడు ఆపదలు వచ్చే అవకాశం. షష్ఠీనాడు అకాల వైరాలు. అష్టమినాడు అష్టకష్టాలు. నవమినాడు నష్టాలూ వ్యధలూ కలుగుతాయి. ద్వాదశి నాడు మహానష్టాలు. బహుళ చతుర్థి నాడు ప్రయాణం చేస్తే, చెడును కలిగిస్తుంది. శుక్ల చతుర్దశినాడు ఏ పనీ కాదు.

ఇక మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం మంచింది. ముఖ్యంగా సోమవారం, తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శని వారాలు.. పాఢ్యమి, ద్వాదశి, షష్ఠి, అష్టములలో, ప్రయాణాలు చేయకూడదు.

అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి, శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు. అందువల్ల, ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం మంచిది. 

పౌర్ణమి, అమావాస్య నాడు ప్రయాణాలు, మానవుడి మనస్సుపై గ్రహాల ప్రభావం ఉంటుంది. చంద్ర గ్రహ ప్రభావం, మనస్సుపై స్పష్టంగా ఉంటుంది. పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనస్సుకీ అధిపతి. అందుకే, సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే, మన శరీరంలో కూడా, నీరూ, లవణాలూ, మనస్సూ ఉంటాయి. వీటికీ అధిపతి చంద్రుడే కనుక, మన శరీరానికీ ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే, ఇవి అంతగా పైకి కనబడవు. మన శరీరంలో ఆటు పోట్లెక్కువగా ఉన్నప్పుడు, మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేక పోవచ్చు. ప్రయాణాల విషయంలో, సరైన నిర్ణయాలు తీసుకోవటం, ప్రయాణ సమయంలో కానీ, మన పనుల్లో కానీ, చాలా అవసరం. అందుకే, ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో, ప్రయాణం చేయవద్దు. మొత్తానికి పూర్ణిమ రోజు పనులు ఏవీ కావు.

ప్రతి రోజూ ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే వారు, పై నియమాలను పాటించ వలసిన అవసరము లేదు. ప్రత్యేక అవసరాల నిమిత్తమూ, కార్యసిద్ధి కొరకూ ప్రయాణం చేసేవారు, పై నియమాలను తప్పని సరిగా పాటిస్తే మంచిది..

సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgxIJWGdO0IMMxNoAm14AaABCQ

No comments: