Ads

Showing posts with label Sri Anantalwar. Show all posts
Showing posts with label Sri Anantalwar. Show all posts

09 April, 2021

శ్రీ అనంతాళ్వారులు! Sri Anantalwar

 

శ్రీ అనంతాళ్వారులు!

శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేశ్వరుడు, శ్రీ అనంతాళ్వారులు. శ్రీ అనంతాళ్వారులు, తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపున నివసించేవారు. ఈయన స్వామి వారికి రోజూ, పూల మాలాలు సమర్పించే వారు. తిరుమలలో పూల తోటవేసి, ఆ తోట లోని పూలను మాలలుగా అల్లి, రోజూ స్వామి వారికి సమర్పించేవారు.

వేంకటేశ్వర పద్మావతీ కల్యాణం 3 యుగాల చరిత్ర! = https://youtu.be/Oteo6hAa0IY ]

అనంతాళ్వారులు, భార్య సహకారంతో, తిరుమలలో, పూల తోటకి నీళ్ళ కోసం, బావిని తవ్వటం మొదలుపెట్టారు. అనంతాళ్వారులు, గునపంతో బావి తవ్వుతూ, మట్టిని తట్టలో పోస్తే, ఆయన భార్య ఆ మట్టి తట్టని తీసుకుని వెళ్ళి, దూరంగా పోసి వచ్చేది. అనంతాళ్వారులకు ఆ సమయంలో సహాయం చెయ్యటానికి, శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి, అనంతాళ్వారులని, నేను మీకు సహాయం చేస్తాను.. అంటే, అనంతాళ్వారులు  అంగీకరించలేదు.

బాలుడు అనంతాళ్వారుల భార్య దగ్గరకు వెళ్లి, సహాయం చేస్తాను అంటే, ఆమె అంగీకరించింది. ఆమె మట్టి తట్టని తీసుకునివెళ్ళి ఇస్తే, బాలుడు దూరంగా పోసివచ్చేవాడు. భార్య తొందర తొందరగా మట్టి తట్టలు తీసుకుని వెళ్ళటానికి రావటం గ్రహించిన అనంతాళ్వారులు, ఆయన భార్యని అడిగితే, ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్పింది.

ఆగ్రహించిన అనంతాళ్వారులు కోపంతో, చేతిలో ఉన్న గునపాన్ని బాలుని మీదకి విసిరాడు. అది వెళ్ళి బాలుని గడ్డానికి  తగిలింది. ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళి పోయాడు. అనంతాళ్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో, నిమగ్నం అయ్యారు. సాయంత్రం చక్కగా పూల మాలలు అల్లి బుట్టలో పెట్టుకుని, శ్రీవారి ఆలయానికి వెళ్ళారు అనంతాళ్వారులు. అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి, రక్తం కారటం చూసిని అనంతాళ్వారులు, 'అయ్యో.. నేను గునపం విసిరింది ఎవరి మీదకో కాదు..' సాక్షాత్తూ శ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చెయ్యటానికి వచ్చాడని, గ్రహించి, స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దాడు.

ఆనాటి నుంచీ, ఈ నాటి వరకూ, స్వామివారి గడ్డంపై, రోజూ పచ్చ కర్పూరం అద్దుతారు. ఇప్పటికీ మనం, అనంతాళ్వారులు స్వామి వారి మీదకు విసిరిన గునపాన్ని, మహద్వారం దాటిన తర్వాత, కుడి వైపు గోడకు వ్రేళ్లాడుతూ ఉండటం చూడవచ్చు. శ్రీ అనంతాళ్వారుల బృందావనం, శ్రీవారి ఆలయం వెనక వైపున ఉంటుంది. మనం అనంతాళ్వారుల బృందావనం దర్శించవచ్చు. శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి, సంవత్సరానికి ఒకసారి, శ్రీ అనంతాళ్వారుల బృందావనానికి వెళతారు.. ఇవన్నీ ఆ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవమనడానికి, ప్రత్యక్ష సాక్ష్యాలు..

ఓం నమో వేంకటేశాయ!

Link: https://www.youtube.com/post/UgzjBhDLSacHOoD5cSl4AaABCQ