Ads

Showing posts with label Significance of Magha Masam. Show all posts
Showing posts with label Significance of Magha Masam. Show all posts

13 February, 2021

మాఘమాసం విశిష్టత! Significance of Magha Masam


మాఘమాసం విశిష్టత!

చంద్రుడు మఖా నక్షత్రంలో కూడిన మాసం, 'మాఘమాసం'. ఇది విష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైనది.

[ విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/q7OQVyx4sU4 ]

మాఘ స్నానం:

ఉషోదయానికి ముందే చేసే స్నానాలు, ఆత్యంత పుణ్య ప్రదమైనవి, మరియు అరోగ్యవంతమైనవి. ఈ స్నానాలకి అధిపతి, సూర్య భగవానుడు. కార్తీక గాలుల్లో చంద్రుడు ఓషది కారకుడై ఆరోగ్యం ఎట్లు కలిగించునో, అట్లే రవి కూడా ఈ కాలమందు, ఆయన కిరణాలతో ఆరోగ్యాన్నిస్తాడు. అందుకే, స్నానానంతరం సూర్యునికి ఆర్గ్యం ఇస్తారు. ఇక ఈ స్నానాలు అఘమర్షణ స్నాన ఫలాన్ని ఇస్తాయి. పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి. శత గుణ ఫలాన్ని ఇస్తాయి.

"దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చl

ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనంll

మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవl

స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవll"

అనే శ్లోకం చదువుతూ, మాఘ స్నానం చేయాలి.

ఈ మాసం ఏ పారాయణ చేసినా, అది అద్భుత ఫలితాన్నిస్తుంది. 

'అరుణోదయేతు సంప్రాప్తే, స్నానకాలే విచక్షణః

మాధవాంఘ్రి యుగం ధ్యాయన్ యః స్నాతి సురపూజితః'

ఇలా బ్రహ్మ పురాణం చెబుతున్నది. అనగా, సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే, దేవతల చేత పూజితుడవుతాడు. ఇక, నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం. లేనప్పుడు చేయడం మధ్యమం. సూర్యోదయం తదుపరి చెస్తే అధమం.

ఇక తిలలు, ఉసిరికలు దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అశ్వద్ధ వృక్షాన్ని పూజించడం, చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. పుష్య బహుళ అమావాస్య నుండే మొదలు పెట్టాలి స్నానాలు.

ఇక మాఘమాసంలో వచ్చే నోములు, పండుగలు, చాలా ఉన్నవి. ఆదివారాలు గొప్పవి. ఆయా వారాలలో నోముల్లో ఉన్న స్త్రీలు తరిగిన కూరలు తినరు.

మాఘ గౌరినోము, మాఘ ఆదివారం నోము ఉంటాయి. అలాగే, మాఘ శుద్ధ చతుర్థి అనగా వర చతుర్ధి, పగలు ఉపవాసం ఉండి గణపతిని పుజించి రాత్రి భుజించాలి. సాయంత్రం శివుని పూజ చేయాలి. ఇక, మాఘశుద్ద పంచమి శ్రీ పంచమి. సరస్వతి అవిర్భవించిన రోజు. ఆ నాడు అక్షరాభ్యాసం చేసుకున్నవారు, అదృష్టవంతులు. తదుపరి మాఘ శుద్ధ సప్తమి - రథ సప్తమి యనబడును. బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని కలిగి యుండునని, పురాణ వచనం. రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు. ఆ నాటి నుండి, రవికి భూమి దగ్గరవడం మొదలు. ఆపై వేసవి కాలం మొదలు. ఆనాడు ఆయన్ని పూజిస్తే, రాజయోగాలు, ఆరోగ్యం, అదృష్టం కలుగుతుంది. 

ఆపై మాఘ శుద్ధ అష్టమి, 'భీష్మాష్టమి'. ఆయన పరమపదించిన రోజు. తదుపరి, మాఘ శుక్ల ఏకాదశి, భీష్మ ఏకాదశి. కృష్ణుడిచే సత్యవ్రతుడు వరం పొందిన రోజు. ఆ నాడు ఆయన మోక్షం పొందిన రోజు. ఆ నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణువునకు ప్రీతి. మరునాడు భీష్మ ద్వాదశి. ఆనాడు కృష్ణుడిలో లీనమైన రోజు. 

ఆపై, మాఘ శుద్ధ పూర్ణిమ అంటే, మహా మాఘి. దేవి శక్తి అపారమైనదిగా మారే రోజు. ఆపై, మాఘ బహుళ చతుర్థి. సంకష్టహర చతుర్థి. ఆపై, మాఘ బహుళ చతుర్దశి. మహా శివరాత్రి పర్వదినం.

ఇంత ప్రత్యేకమైనదీ, గొప్పదైనదీ అయిన మాఘమాసం, అందరూ విష్ణువుని ఆరాధించి, స్వామి కృపకి పాత్రులమవుదాం.. సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgxEZ6os0X6IA2ZG6vt4AaABCQ