Ads

Showing posts with label Sanyasam. Show all posts
Showing posts with label Sanyasam. Show all posts

22 May, 2021

సన్యాసం! - Sanyasam

 

సన్యాసం!

ఆధ్యాత్మిక ప్రయాణంలో తప్పక తెలుసుకోవలసిన స్దితులు..

యుద్ధరంగంలో చలించిపోయిన అర్జునుడు! = https://youtu.be/4Sp133zs0ag ]

అవధూత అంటే, కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో, ఎప్పుడో, ఏమరుపాటుగా వచ్చి, వెళ్లిపోతూ ఉంటారు. అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు, సన్యాసం గురించి తెలుసుకుందాము.

సన్యాసం నాలుగు రకాలు.

1. వైరాగ్య సన్యాసం..

వ్యర్ధమైన విషయం వినడం, చూడటంపై ఆసక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి, ఇది ఇష్టం అది ఇష్టం లేదు, అనే భావన ఉండదు. అన్ని విషయాలపై మెల్లగా, అనాసక్తి మొదలౌతుంది.

2. జ్ఞాన సన్యాసం..

సత్ సాంగత్యం ద్వారా, లౌకిక వాంఛలు తగ్గిపోయి, సత్యాసత్య విచక్షణతో, జ్ఞానంతో, నిత్యం కర్మలు ఆచరిస్తూ, ఏదీ తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు.

3. జ్ఞాన వైరాగ్య సన్యాసం..

సాధన ద్వారా, ధ్యానం ద్వారా అభ్యసించి, తనకు తాను అన్వయించుకుని, నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు.

4. కర్మ సన్యాసం..

బ్రహ్మ చర్యము, గృహస్త, వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ, ఫలితాన్ని ఆశించక, కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం.

ఈ సన్యాసులు ఆరు రకాలు..

1. కుటిచకుడు..

శిఖ, యజ్నోపవీతము, దండ, కమండలాలు ధరించి, సంచారం చేయకుండా, భక్తి మార్గంలో వసిస్తూ, అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.

2. బహుదకుడు..

వీరు రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ, నిత్యం సాధన చేస్తూ ఉంటారు.

3. హంస..

ఇతను జడధారియై, కౌపీనం ధరించి ఉంటాడు.

4. పరమహంస..

వెదురు దండాన్ని కలిగి, ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని, కౌపీనం మాత్రం ధరించి, నిరంతర సాధనలో ఉంటారు.

5. తురియాతితుడు..

దేహాన్ని ఓ శవంలా చూస్తాడు.

6. అవధూత..

ఇతనికి ఏ విధమైన నిష్ఠ నియమాలు లేవు. జగత్ మిధ్య, నేను సత్యం అంటూ, నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు.. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు.. నాకు పాప పుణ్యాలూ, సుఖ దుఖాలూ లేవు.. గర్వము, మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము, అన్నింటినీ త్యజించి, ప్రాణాలు నిలుపుకోవడానికి, అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి, దొరికిన రోజు ద్వాదశి అంటూ, రాత్రీ పగలూ, నిత్య ఎరుకతో సంచారం చేస్తూ, పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు. కర్మలు అన్నీ క్షయం అయిపోయి, వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు..

శుభం భూయాత్!

Link: https://www.youtube.com/post/UgxucE879oiWeyaV7F54AaABCQ