Ads

Showing posts with label Present day cities mentioned in Hindu Puranas. Show all posts
Showing posts with label Present day cities mentioned in Hindu Puranas. Show all posts

16 March, 2021

పురాణాలలో చెప్పబడిన నేటి నగరాలు! Present day cities mentioned in Hindu Puranas


పురాణాలలో చెప్పబడిన నేటి నగరాలు!

మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలూ, మరియూ అన్యమత మతోన్మాదుల దాడులు తట్టుకుని నిలచిన భారతీయ శిల్ప, వాస్తు శాస్త్రంతో నిర్మాణం చేసిన అత్యంత అధ్బుతమైన శిల్ప కళా సంపద ఉన్న ఆలయాలూ, నగరాలూ, సకల శాస్త్రాలనూ, వేదాలనూ బోధించిన విశ్వ విద్యాలయాలు..

[ మన పురాణాలలో ప్రస్థావించబడిన 20 నగరాలు! = https://youtu.be/_0HDjECQ4ao ]

కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్..

లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్..

తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షకుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్..

పుష్కలావతి / పురుష పురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్, భాగవతం, మహాభారతం..

మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం, నేపాల్..

నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్..

జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్..

మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) - మహేశ్వర్, మధ్యప్రదేశ్..

శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి, వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు), కురుక్షేత్రం..

దుర్యోధనుని చంపిన చోటు - కురుక్షేత్ర, హర్యానా..

పరశురామ క్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి, సముద్రజలాలను వెనక్కి పంపి, తన కోసం నేలను సృష్టించుకున్న ప్రాంతం) - కేరళ, కర్ణాటక, మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం..

[ కేరళ ఎలా పుట్టింది? = https://youtu.be/VRRtUbWh1UI ]

మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా..

నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా, మధ్యప్రదేశ్..

వ్యాస మహర్షి పుట్టిన స్థలం - ధమౌలి, నేపాల్..

నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలూ, పురాణాలూ బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్..

వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు - మన గ్రామం, ఉత్తరాంచల్..

రతిష్టానపురం (పురూరవుని రాజధాని) - ఝున్సి, అలహాబాద్..

సాళ్వ రాజ్యం (సావిత్రీ, సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం) - కురుక్షేత్ర దగ్గర..

హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్..

మధు పురం / మధు వనం (కంసుని రాజధాని) - మధుర, ఉత్తర్ ప్రదేశ్..

[ శ్రీకృష్ణ మథుర దాచిన చరిత్ర రహస్యాలు! = https://youtu.be/LnpC21icsXU ]

వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర..

కుంతీ పురి (పాండు రాజు మొదటి భార్య కుంతీ దేవి పుట్టినిల్లు) - గ్వాలియర్..

మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్..

ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం) - డెహ్రాడూన్..

గురు గ్రామం (కురు పాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా..

కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)..

పాండవుల లక్క గృహ దహనం - వర్నాల్, హస్తినాపూర్..

కాల యవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్..

శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక, గుజరాత్..

[ సముద్రగర్భంలో బయటపడ్డ ద్వారకకు సొరంగ మార్గం! = https://youtu.be/Yxs2xyS9I_k ]

హిడింబ వనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) - జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్..

విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర..

కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర..

చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్య ప్రదేశ్..

కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్..

ఖాండవ ప్రస్థం / ఇంద్ర ప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్ర ప్రస్థ, ఢిల్లీ దగ్గర..

కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్..

పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్..

కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు, మత్స్య యంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్..

జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్..

[ జరాసంధుడి వధ వెనుక అసలు వాస్తవాలు! = https://youtu.be/XDn1AuxStl8 ]

కామ్యక వనం, దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా..

మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) - ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్..

విరాట నగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్, రాజస్థాన్..

శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం..

ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం..

నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్..

[ విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు! = https://youtu.be/q7OQVyx4sU4 ]

జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం, ఉత్తర్ ప్రదేశ్..

కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం) - నేపాల్ లోని తిలార్కోట్..

బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం - బోధ్ గయ, బీహార్..

గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందిన చోటు - కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్..

పుణ్య భూమి నా దేశం! నమో నమామి!