Ads

Showing posts with label Parijata Tree. Show all posts
Showing posts with label Parijata Tree. Show all posts

28 September, 2021

కృష్ణ పరమాత్ముడు దివి నుంచి భువికి తెచ్చిన దేవతా వృక్షం! Parijata Tree

 

కృష్ణ పరమాత్ముడు దివి నుంచి భువికి తెచ్చిన పారిజాత వృక్షం!

సుమారు 5000 సంవత్సరాల పూర్వం, మహాభారత కాలంలో, శ్రీ కృష్ణ పరంధాముడు ఇంద్రలోకం నుంచి తెచ్చి, సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఇదే. ఈ పారిజాత వృక్షం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారబంకి జిల్లాలో, కింటూర్ గ్రామం వద్ద ఉన్నది. ప్రపంచంలో కెల్లా విలక్షణమైన వృక్షంగా, శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు.

[ విధి లిఖితం కృష్ణుడినైనా విడిచిపెట్టదు! = https://youtu.be/q7OQVyx4sU4 ]

ఇది శాఖల నుండి పునరుత్పత్తి గానీ, పండ్లు గానీ ఉత్పత్తి చేయదు. అందుకే, ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకూ లేని ప్రత్యేకత, ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగన ఆకులు, యేడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా, చాలా అందంగా, బంగారు రంగూ మరియు తెలుపు రంగులు కలిసిన ఒక ఆహ్లదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా అదీ జూన్, జూలై నెలలో మాత్రమే ఈ వృక్షం వికసిస్తుంది. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకూ వ్యాపిస్తుంది. ఈ పువ్వులు రాత్రి పూట వికసించి, ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచి పరచినట్లు కనువిందుచేస్తాయి.

సాధారణంగా క్రింద పడిన పూలను పూజకు వాడరు. అయితే, పారిజాత పుష్పాల విషయంలో, ఈ పద్ధతికి మినహాయింపు ఉంది. ఈ చెట్టు పూలు క్రింద పడినా, వాటి పవిత్రత ఏమాత్రం చెడదు. పారిజాత పుష్పాలతో పూజ, దేవతలకు అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు. ఈ పూలనుంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు. దీని ఆకులతో కాచిన కషాయాన్ని కీళ్ల నొప్పుల నివారణకు వాడతారు. ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న నిఫా వైరస్‌ను ఈ చెట్టు ఆకులతో నివారించవచ్చునని, నిపుణులు చెబుతున్నారు.

ఈ వృక్షం యొక్క వయస్సు, సుమారు 5000 సంవత్సరాలుగా చెప్పబడుతోంది. ఈ వృక్ష కాండము చుట్టు కొలత 50 అడుగులుగానూ, ఎత్తు 45 అడుగులుగానూ చెప్పబడింది. ఈ వృక్షం యొక్క మరొక గొప్పదనం, దీని శాఖలు గానీ, ఆకులు గానీ కుంచించుకుపోయి, కాండంలో కలిసిపోవటమే కానీ, ఎండిపోయి రాలిపోవటం జరగదు. ఇప్పుడు నిపుణులు ఈ వృక్షం మనుగడ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏