చైత్ర పౌర్ణమి - చిత్రగుప్తుడు!
చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి ఐన ఈ రోజుని చైత్ర పౌర్ణమి అని మన హిందూ ధర్మంలో ఒక పండుగలా చేసుకుంటారు. ఈ పండుగ హిందూ దేవుడైన చిత్రగుప్తునికి అంకితం చేయబడింది. హిందూ సనాతన ధర్మం ప్రకారం, మానవుల యొక్క పాపములు, పుణ్యములు లెక్కలు కట్టి, ఆ మానవులకు ఆయా శిక్షలు వేయిస్తారు గనక, ఈ రోజు, భక్తులు తమ పాపాలను క్షమించమని చిత్రగుప్తుడిని ప్రార్ధిస్తారు.
ఈ పండుగ రోజున చాలా మంది భక్తులు, తమ పాపాలను కడిగివేయడానికి ప్రతీకగా, నదులలో లేదా ఇతర నీటి వనరులలో స్నానం చేస్తారు. మన భారతదేశంలోని తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని చిత్ర నది వద్ద, ఈ ఆచారం చాలా ప్రాచుర్యం పొందింది.
అలాగే, కేరళ రాజధాని తిరువనంతపురంలో, పచ్చల్లూర్ ఎన్ రూట్ కోవళం వద్ద, చిత్ర పూర్ణిమ వాలియ తోట్టం భగవతి ఆలయం ఉంది. అక్కడ ఈ పండుగను గత కొన్ని వందల సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు. ఈ ఆలయం, ఈ ప్రాంతానికి చెందిన మేలంగనాతిల్ వీడు వాలియ తోట్టం తారావాదుకు చెందినది. ఇది శక్తికి అంకితమైన హిందూ దేవాలయం.
Link: https://www.youtube.com/post/UgwjT79uixuDJJaLNft4AaABCQ