సంపూర్ణ రక్ష!
కలియుగంలో మానవుల ఆధ్యాత్మిక సమర్థత పూర్తిగా క్షీణిస్తుందని.. వారు ధార్మిక కార్యాలు నిర్వహించడంలో అశక్తులని తెలిసిన వాడు ఈ భవిష్య బ్రహ్మ 'హనుమ'..
[ రాముని తరువాత వారి వంశం ఏమైందో తెలుసా? = ఈ వీడియో చూడండి: https://youtu.be/q18fhoB8AoA ]
అందుచేతనే పరమ దయాళువైన ఈ రామదాసుడు కేవలం సంకీర్తనకు.. సూక్ష్మమైన స్మరణకు.. స్తోత్రానికి, తలంపునకు.. కూడా కరిగిపోతాడు.
భక్తులు తనకు హోమాలు, యాగాలు, పూజలు, కల్యాణాలు, వ్రతాలు, క్రతువులు చేయాలని ఏమాత్రం ఎదురు చూడడు. 'రామ' అనే రెండక్షరాలు మనసులో తలచుకుంటే చాలు.. అదే మహా పుణ్యకార్యమని మురిసిపోతాడు.. ఆమాత్రం స్మరణకే మహాభక్తుడని పొంగిపోతాడు.. ఆ దాసానుదాసునికి మేలు చేయాలని సంకల్పిస్తాడు.. అపార కరుణతో అరక్షణంలో అక్కడ వాలిపోతాడు.
ఎక్కడ రాముడి కోసం ఎవరు తలచుకున్నా.. ఎక్కడ సీతారాములను కొలిచే, తలిచే ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా, అక్కడ మహా పరవశంతో.. ఆనందబాష్పాలతో కొలువుదీరుతాడు మన ఆంజనేయస్వామి. తన స్వామిని తలచిన వాడు ఎవడైనా సరే, కష్టాలు పడకూడదనేది ఈ స్వామి వ్రతం. రామభక్తులను అనుగ్రహించుటే, ఈ స్వామి నియమం. అందుకే, రామ నామాన్ని పట్టుకున్న ఎవరికైనా సంపూర్ణ రక్ష. నారాయణావతారుడైన పరిపూర్ణ బ్రహ్మం, శ్రీరామం.
ఆ రామనారాయణుడు పరాన్ని అనుగ్రహిస్తే.. ఈ రామబంటు ఇహాన్ని దాటిస్తాడు.
మహా సాగరాన్ని అవలీలగా దాటిన హనుమకు.. మనల్ని భవ సాగరం దాటించడం ఓ లెక్కా..!
నిరంతరం శ్రీరామనామాన్ని పట్టుకోండి.. ఆ హనుమ మన వెంటనే ఉంటాడు.
సీతారాములను మనం తలచినంత కాలం, మారుతి కరుణాకటాక్షాలు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాయి. ఒక్క రామ మంత్రమే, కోటి మంత్రాల పెట్టు.. ఒక్క హనుమదనుగ్రహం, ముక్కోటి దేవతల కటాక్షానికి సాటి..
ఈ రోజు 'వాల్మీకి మహర్షి' వీడియో పోస్ట్ చెయ్యబోతున్నాను.. చూసి మీ అభిప్రాయం చెబుతారని ఆశిస్తున్నాను.. మీ మహీధర్ 🙏
జై శ్రీరామ్!
Link: https://www.youtube.com/post/Ugwuo3GFISickjk-NJB4AaABCQ