స్వర్ణవర్ణం చతుర్బాహుం త్రినేత్రం పీతవాససం |
స్వర్ణ పాత్రధరం వందే స్వర్ణాకర్షణ భైరవం ||
పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం. చూడడానికి ఎర్రటి చాయతో ప్రకాశిస్తూ ఉంటారు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడిని ధరించి, చతుర్భుజాలతో, ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు, సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.
కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం
ఫ్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం!
అని శివరాత్రికి మనవూళ్ళో గుళ్ళోని పాటతో, కాలభైరవుడి పరిచయం అవుతుంది. కాలభైరవుడు వారణాసికి క్షేత్రపాలకుడిగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలన్నా, ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తూ శివుడే కాలభైరవుడై సంచరించాడని, శాస్త్రాలు చెపుతున్నాయి. అనేక దేవాలయాల్లో, కాలభైరవ విగ్రహం వుంటుంది. ఆయన క్షేత్రపాలకుడిగా, గ్రామ, నగర రక్షకుడిగా, మంత్ర శాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్ర మూర్తిగా, మనకి తెలుసు.
కాలమే జగన్మూలం. ఆ కాలరూపుడే కాలభైరవుడు. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా, దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలని అధిగమించి, అదృష్ట జీవితాన్నీ, సంకల్ప సిద్ధినీ పొందడం, భైరవోపాసనతో సాధ్యం. కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, అనేక సంవత్సరాలు కాలభైరవాలయంలో సాధనచేసినట్లు, ఆ పీఠంలో, ఆ సమయంలో వున్న సాధకులు తెలిపారు.
కాలభైరవుడ్ని నేపాల్ ప్రాంతాల్లో, హిమాలయాల్లో ఎక్కువగా పూజిస్తారు. ఖాట్మండు నగరం మధ్యలో వున్న కాలభైరవ మూర్తి, చాలా దశాబ్దాలు నేపాల్ సుప్రీం కోర్టుగా పరిగణించబడేది. ఆ విగ్రహం ముందు ఎవరైన అబద్దం చెపితే సజీవులై వుండలేరని నమ్మకం. ఇటువంటిదే కాణిపాకంలోని వినాయకుడి ప్రాశస్త్యమని అంటారు. ఆధునిక యుగంలోనూ, కొన్ని కొన్ని విశేషాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆయన పేరుకి తగ్గట్టు, ధన సమృద్ధినీ, ఋణ విముక్తినీ ఇస్తాడు. అన్నిటికన్నా ముఖ్యం, జ్ఞాన వైరాగ్యాలకి ఆయనే అత్యంత సన్నిహితుడూ, కారకుడూ.
స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం:
ఓం అస్య శ్రీ స్వర్ణాఽకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య
బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా
హ్రీం బీజం క్లీం శక్తిః సః కీలకం మమ దారిద్ర్య నాశార్థే పాఠే వినియొగః ||
ఋష్యాది న్యాసః:
బ్రహ్మర్షయే నమః శిరసి |
అనుష్టుప్ ఛందసే నమః ముఖే |
స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది |
హ్రీం బీజాయ నమః గుహ్యే |
క్లీం శక్తయే నమః పాదయోః |
సః కీలకాయ నమః నాభౌ |
వినియొగాయ నమః సర్వాంగే |
హ్రాం హ్రీం హ్రూం ఇతి కర షడంగన్యాసః ||
ధ్యానం:
పారిజాతద్రుమ కాంతారే స్థితే మాణిక్య మండపే
సింహాసన గతం వందే భైరవం స్వర్ణదాయకం |
గాంగేయ పాత్రం డమరూం త్రిశూలం
వరం కరః సందధతం త్రినేత్రం
దేవ్యాయుతం తప్త స్వర్ణవర్ణ
స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి ||
మంత్రః:
ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధారణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలవధ్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః శ్రీం హ్రీం ఐం |
స్తోత్రం:
ఓం నమస్తే భైరవాయ బ్రహ్మ విష్ణు శివాత్మనే|
నమః త్రైలోక్య వంద్యాయ వరదాయ వరాత్మనే || ౧ ||
రత్నసింహాసనస్థాయ దివ్యాభరణ శోభినే |
దివ్యమాల్య విభూషాయ నమస్తే దివ్యమూర్తయే || ౨ ||
నమస్తే అనేక హస్తాయ అనేక శిరసే నమః |
నమస్తే అనేక నేత్రాయ అనేక విభవే నమః || ౩ ||
నమస్తే అనేక కంఠాయ అనేకాంశాయ తే నమః |
నమస్తే అనేక పార్శ్వాయ నమస్తే దివ్య తేజసే || ౪ ||
అనేకాఽయుధయుక్తాయ అనేక సురసేవినే |
అనేక గుణయుక్తాయ మహాదేవాయ తే నమః || ౫ ||
నమో దారిద్ర్యకాలాయ మహాసంపత్ప్రదాయినే |
శ్రీ భైరవీ సంయుక్తాయ త్రిలోకేశాయ తే నమః || ౬ ||
దిగంబర నమస్తుభ్యం దివ్యాంగాయ నమో నమః |
నమోఽస్తు దైత్యకాలాయ పాపకాలాయ తే నమః || ౭ ||
సర్వజ్ఞాయ నమస్తుభ్యం నమస్తే దివ్య చక్షుషే |
అజితాయ నమస్తుభ్యం జితమిత్రాయ తే నమః || ౮ ||
నమస్తే రుద్రరూపాయ మహావీరాయ తే నమః |
నమోఽస్త్వనంత వీర్యాయ మహాఘోరాయ తే నమః || ౯
నమస్తే ఘోర ఘోరాయ విశ్వఘోరాయ తే నమః |
నమః ఉగ్రాయ శాంతాయ భక్తానాం శాంతిదాయినే || ౧౦
గురవే సర్వలోకానాం నమః ప్రణవ రూపిణే |
నమస్తే వాగ్భవాఖ్యాయ దీర్ఘకామాయ తే నమః || ౧౧ ||
నమస్తే కామరాజాయ యొషిత కామాయ తే నమః |
దీర్ఘమాయాస్వరూపాయ మహామాయాయ తే నమః | ౧౨
సృష్టిమాయా స్వరూపాయ నిసర్గ సమయాయ తే |
సురలోక సుపూజ్యాయ ఆపదుద్ధారణాయ చ || ౧౩ ||
నమో నమో భైరవాయ మహాదారిద్ర్యనాశినే |
ఉన్మూలనే కర్మఠాయ అలక్ష్మ్యాః సర్వదా నమః || ౧౪ ||
నమో అజామలవధ్యాయ నమో లోకేష్వరాయ తే |
స్వర్ణాఽకర్షణ శీలాయ భైరవాయ నమో నమః || ౧౫ ||
మమ దారిద్ర్య విద్వేషణాయ లక్ష్యాయ తే నమః |
నమో లోకత్రయేశాయ స్వానంద నిహితాయ తే || ౧౬ ||
నమః శ్రీ బీజరూపాయ సర్వకామప్రదాయినే |
నమో మహాభైరవాయ శ్రీ భైరవ నమో నమః || ౧౭ ||
ధనాధ్యక్ష నమస్తుభ్యం శరణ్యాయ నమో నమః |
నమః ప్రసన్న (రూపాయ) ఆదిదేవాయ తే నమః || ౧౮ ||
నమస్తే మంత్రరూపాయ నమస్తే మంత్రరూపిణే |
నమస్తే స్వర్ణరూపాయ సువర్ణాయ నమో నమః || ౧౯ ||
నమః సువర్ణవర్ణాయ మహాపుణ్యాయ తే నమః |
నమః శుద్ధాయ బుద్ధాయ నమః సంసార తారిణే || ౨౦ ||
నమో దేవాయ గుహ్యాయ ప్రచలాయ నమో నమః |
నమస్తే బాలరూపాయ పరేషాం బలనాశినే || ౨౧ ||
నమస్తే స్వర్ణసంస్థాయ నమో భూతలవాసినే |
నమః పాతాళవాసాయ అనాధారాయ తే నమః || ౨౨ ||
నమో నమస్తే శాంతాయ అనంతాయ నమో నమః |
ద్విభుజాయ నమస్తుభ్యం భుజత్రయ సుశోభినే || ౨౩ ||
నమోఽణిమాది సిద్ధాయ స్వర్ణహస్తాయ తే నమః |
పూర్ణచంద్ర ప్రతీకాశ వదనాంభోజ శోభినే || ౨౪ ||
నమస్తేఽస్తు స్వరూపాయ స్వర్ణాలంకార శోభినే |
నమః స్వర్ణాఽకర్షణాయ స్వర్ణాభాయ నమో నమః || ౨౫
నమస్తే స్వర్ణకంఠాయ స్వర్ణాభ అంబరధారిణే |
స్వర్ణసింహాసనస్థాయ స్వర్ణపాదాయ తే నమః || ౨౬ ||
నమః స్వర్ణాభపాదాయ స్వర్ణకాంచీ సుశోభినే |
నమస్తే స్వర్ణజంఘాయ భక్తకామదుధాత్మనే || ౨౭ ||
నమస్తే స్వర్ణభక్తాయ కల్పవృక్ష స్వరూపిణే |
చింతామణి స్వరూపాయ నమో బ్రహ్మాది సేవినే || ౨౮ ||
కల్పద్రుమాద్యః సంస్థాయ బహుస్వర్ణ ప్రదాయినే |
నమో హేమాకర్షణాయ భైరవాయ నమో నమః || ౨౯ ||
స్తవేనానేన సంతుష్టో భవ లోకేశ భైరవ |
పశ్య మాం కరుణాద్రుష్ట్యా శరణాగతవత్సల || ౩౦ ||
శ్రీ మహాభైరవస్య ఇదం స్తోత్రముక్తం సుదుర్లభం |
మంత్రాత్మకం మహాపుణ్యం సర్వైశ్వర్యప్రదాయకం || ౩౧ ||
యః పఠేన్నిత్యం ఏకాగ్రం పాతకై స ప్రముచ్యతే |
లభతే మహతీం లక్ష్మీం అష్టైశ్వర్యం అవాప్నుయాత్ || ౩౨
చింతామణిం అవాప్నోతి ధేను కల్పతరుం ధృవం |
స్వర్ణరాశిం అవాప్నోతి శీఘ్రమేవ న సంశయః || ౩౩ ||
త్రిసంధ్యం యః పఠేత్ స్తోత్రం దశావృత్యా నరోత్తమః |
స్వప్నే శ్రీ భైరవః తస్య సాక్షాత్ భూత్వా జగద్గురుః || ౩౪ ||
స్వర్ణరాశి దదాత్యస్యై తత్‍క్షణం నాత్ర సంశయః |
అష్టావృత్యా పఠేత్ యస్తు సంధ్యాయాం వా నరోత్తమం౩౫
లభతే సకలాన్ కామాన్ సప్తాహాన్ నాత్ర సంశయః |
సర్వదా యః పఠేత్ స్తోత్రం భైరవస్య మహాత్మనాః || ౩౬ ||
లోకత్రయం వశీకుర్యాత్ అచలాం లక్ష్మీం అవాప్నుయాత్ |
న భయం విద్యతే క్వాపి విషభూతాది సంభవం || ౩౭ ||
మ్రియతే శత్రవః తస్య అలక్ష్మీ నాశం ఆప్నుయాత్ |
అక్షయం లభతే సౌఖ్యం సర్వదా మానవోత్తమః || ౩౮ ||
అష్ట పంచాత్వర్ణాద్యో మంత్రరాజః ప్రకీర్తితః |
దారిద్ర్య దుఃఖశమనః స్వర్ణాకర్షణ కారకః || ౩౯ ||
య ఏన సంచయేత్ ధీమాన్ స్తోత్రం వా ప్రపఠేత్ సదా |
మహాభైరవ సాయుజ్యం స అనంతకాలే లభేత్ ధృవం || ౪౦ ||
ఇతి రుద్రయామల తంత్రే స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం సంపూర్ణం ||
మంగళవారం, శుక్రవారం, అష్టమి తిథి పౌర్ణమి రోజులలో అరాధిస్తే, మంచి ఫలితం లభిస్తుంది.
[ తప్పక తెలుసుకోవలసిన కాల భైరవుని ఆవిర్భావం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/E_-ldokW73M ]
[ బ్రహ్మ అయిదవ తలను గోటితో గిల్లేసిన ‘కాలభైరవుని ఆవిర్భావం’ = ఈ వీడియో చూడండి: https://youtu.be/4O0axDLxgE4 ]
Link: https://www.youtube.com/post/UgxtNsvpI8Gj_R8Eidt4AaABCQ