Ads

Showing posts with label లక్ష్మీదేవి - ధర్మం!. Show all posts
Showing posts with label లక్ష్మీదేవి - ధర్మం!. Show all posts

20 March, 2021

లక్ష్మీదేవి - ధర్మం!



లక్ష్మీదేవి - ధర్మం!

లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి, విష్ణుమూర్తిని వేడుకుంది.. 'స్వామీ.. మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోభులు, బద్దకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ.. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు.. నా అంతవాడు లేడు.. అంటారు. ఇలా ఒకటా, రెండా? సంపదల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు.. కనుక నేను వెళ్ళలేను.. కనికరించండి' అని మొరపెట్టుకుంది..

[ నిజమైన సంపద! = https://youtu.be/sX5tx83D7Ww ]

అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నారు..

'నువ్వు భయపడకు.. నీకు తోడుగా నలుగురిని పంపుతున్నాను.. రాజు, అగ్ని, దొంగ, రోగం.. ఈ నలుగురూ, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు..

ధర్మంగా సంపాదించి దాన ధర్మాలూ, పుణ్యకార్యాలూ చేస్తూ ఉండే వారికి, ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు.. చిన్న చిన్న కష్టాలు వచ్చినా, అవి ఎంతోకాలం ఉండవు.. ధర్మమే వారిని నిలబెడుతుంది.. 

ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి, అధర్మంగా జీవిస్తారో.. ఆ నాడు, రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు.. 

ఇది కుదరకపోతే, అగ్ని దహించివేస్తాడు.. మొత్తాన్నీ తగలబెట్టేస్తాడు అగ్ని.. 

ఇక్కడి నుండి తప్పుకుంటే, బంధువులూ, స్నేహితులూ, సుతులూ, పుత్రికల రూపంలోనో, లేక దొంగ రూపంలోనో వచ్చి, వాడిని సర్వం హరించేస్తారు..

ఇది కూడా కాకుంటే, రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించినదంతా రోగాలకో, రొష్టులకో తగలబెట్టేస్తారు.. ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని, పైన చెప్పిన నాలుగూ ఒక్కోసారి పట్టేయవచ్చు.. కనుక నువ్వు నిర్భయంగా వెళ్లి, ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు.. ధర్మం తప్పిన నాడు, నలుగుురూ నీకు తోడుగా ఉంటారు' అని వరమిచ్చి పంపించాడు..

ధర్మస్వ జయోస్తు అధర్మస్య నాశోస్తు ।
ప్రాణీషు సద్భావనాస్తు విశ్వస్య కల్యాణమస్తు ।।