మౌనం!
మౌనమే అత్యుత్తమ దీక్ష.. మనసులో ఏ అలజడీ లేని మౌనమే, అత్యుత్తమ దీక్ష అని, భగవాన్ శ్రీరమణ మహర్షి చెప్పారు. మౌనం అంటే, మాటలు ఆగటం కాదు. విషయాల కోసం, మనస్సు కదలకుండా ఉండటమే మౌనం.
[ కర్మ ఫలితం = https://youtu.be/ncpSVL9FrJo ]
మహిళలు తమ నివాసాల్లోనే, ఎన్నో రకాల పిండి వంటలు చేస్తారు. అలా చేస్తున్నంత సేపూ, ఒక్క పిండి వంట విషయంలో కూడా, వారికి నోరు ఊరదు. అంటే, అన్ని వంటకాల మధ్యా, రుచుల విషయంలో వారి మనస్సు మౌనంగానే ఉంటుంది.
జ్ఞాని కూడా, విషయ ప్రపంచంలో తాను చేయాల్సిన పనులన్నీ చేస్తూనే, అలా మౌనంగా ఉంటాడు. మనస్సుకు అలాంటి మౌనాన్ని అలవర్చటమే, ఏ దీక్షకైనా ఫలం. నిజానికి మనం ఎంచుకున్న లక్ష్యాన్ని ఫలంగా పొందటమే దీక్ష. మౌనమే అత్యుత్తమ సాధన, దీక్ష..
Link: https://www.youtube.com/post/UgwyfahbZWUisvdN1YV4AaABCQ
