Ads

Showing posts with label భగవద్గిత - త్రిగుణాలు!. Show all posts
Showing posts with label భగవద్గిత - త్రిగుణాలు!. Show all posts

24 February, 2021

భగవద్గిత - త్రిగుణాలు! Trigunas


భగవద్గిత - త్రిగుణాలు!

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత ।

రజః సత్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ।। 10 ।।

ఒక్కోసారి రజోతమస్సులపై సత్త్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి సత్త్వము మరియు తమోగుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది. అలాగే, ఇంకొన్ని సార్లు సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది..

[ అమృత హస్తం! = https://youtu.be/RZ2Q8KqiXYc ]

ఒకే వ్యక్తి యొక్క ప్రవృత్తి, ఈ మూడు గుణములలో ఎలా మారుతూ ఉంటుందో, శ్రీ కృష్ణుడు ఇలా వివరించాడు.. ఈ మూడు గుణములూ, భౌతిక శక్తి యందు ఉన్నాయి. అలాగే, మన మనస్సు ఇదే శక్తితో తయారైనది. అందుకే, ఈ  మూడు గుణములూ మన మనస్సులో కూడా ఉన్నాయి.

ఒకరితో ఒకరు తలపడే ముగ్గురు మల్లయోధులతో, వీటిని పోల్చవచ్చు. ప్రతి ఒక్కడూ, మిగతా ఇద్దరినీ క్రిందికి పడవేస్తుంటాడు. కాబట్టి, ఒక్కోసారి మొదటివాడు పైనుంటాడు, ఒక్కోసారి రెండోవాడు, మరోసారి మూడవవాడిదే పైచేయి అవుతుంది. ఇదే విధంగా, ఈ మూడు గుణములూ, వ్యక్తి  యొక్క ప్రవృత్తిపై, ఒక్కోటి ఒక్కోసారి ఎక్కువ ప్రభావంతో ఉంటాయి.

బాహ్యమైన పరిస్థితులూ, అంతర్లీన చింతనా, మరియూ పూర్వ జన్మ సంస్కారములపై ఆధారపడి, ఒక్కో గుణము ఒక్కోసారి ప్రబలమై ఉంటుంది. ఎంతసేపు ఆ ప్రభావం ఉంటుంది? అన్న దానికి ఏమీ నియమం లేదు.. ఒక గుణము మనోబుద్ధులపై, ఒక క్షణం నుండీ ఒక గంట వరకూ ఉండవచ్చు.

సత్త్వ గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ప్రశాంతంగా, తృప్తిగా, దయాళువుగా,  నిర్మలంగా,  ప్రసన్నంగా ఉంటాడు. రజో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ఉద్వేగంతో, లక్ష్యమును సాధించాలనే తపనతో, ఇతరుల విజయం పట్ల అసూయతో, ఇంద్రియ సుఖముల పట్ల ఆసక్తితో ఉంటాడు. తమో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, విపరీత నిద్ర, సోమరితనము, ద్వేషము, కోపము, రోషము, హింస మరియు అపనమ్మకంతో ఉంటాడు.

ఉదాహరణకి, మీరు ఒక గ్రంధాలయంలో కూర్చుని చదువుకుంటున్నారనుకోండి.. అక్కడ ఏ ప్రాపంచిక గందరగోళమూ లేదు. అలాగే, మీ మనస్సు సాత్త్వికముగా ఉంటుంది. మీరు చదువుకోవటం అయిపోయిన తరువాత టీవీ చూడటం మొదలు పెడితే, అందులో చూసే అన్నింటి వలనా, మనస్సు రాజసికమైపోతుంది. అలాగే, ఇంద్రియ సుఖాల పట్ల యావను పెంచుతుంది. మీకిష్టమైన ఛానల్ చూస్తుంటే, మీ కుటుంబ సభ్యుడు వచ్చి, ఆ ఛానల్ మార్చితే, ఈ అల్లరి మనస్సులో తమో గుణమును పెంచుతుంది. అలాగే, మీరు కోపంతో నిండిపోతారు.

ఈ విధంగా, మనస్సు ఈ మూడు గుణముల మధ్య ఊగుతూనే ఉంటుంది, అలాగే వాటి యొక్క స్వభావాలను అపాదించుకుంటుంది..

కృష్ణం వందే జగద్గురుమ్!

Link: https://www.youtube.com/post/Ugy5KQ4GWxG4AaNeKb94AaABCQ