భగవంతుడు ప్రతివొక్కరికీ ఇచ్చిన 5 నిధులు!
ఒకసారి చాలా పేదవాడొకడు బుద్దుడి వద్దకి వచ్చి ఇలా అడిగాడు.. నాకెందుకీ పేదరికం? నేనెంఎందుకు పేదవాడను?
[ బోధిధర్ముడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/QNQ-28egw3s ]
అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి: శాంతి: శాంతి:
బుద్ధుడు సమాధానం చెప్పాడు.. మీ పేదరికానికి కారణం, మీలో ఎటువంటి ఔదార్యమూ కలిగి లేరు.. అలాగే, దాన ధర్మాలు చేయరు.. కాబట్టి మీరు పేదవారని అన్నారు..
దానికా పేదవాడు, నేను ఇతరులకు దానం చేయడానికి నా వద్ద ఏమున్నది కనుక? అని అన్నాడు..
అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు.. మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను కలిగివున్నారు తెలుసా?
మొదటిది మీ ముఖం.. మీరు ఇతరులతో మీ ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు.. ఇది ఉచితం.. ఇది ఎదుటివారిపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది..
రెండవది మీ కళ్ళు.. మీరు ప్రేమ, మరియు శ్రద్ధతో, ఇతరులను చూడవచ్చు..
ఇది నిజం.. లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు.. వాటిని మంచి అనుభూతితో చేయండి..
మూడవది మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు.. ఈ నోటితో, మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు.. మంచి చర్చించి, సత్సంగంలో చేర్పించి, విలువైనదిగా భావించండి.. దానితో ఆనందము మరియు సానుకూలతా వ్యాప్తి చెందుతాయి..
నాలుగవది మీకు భగవంతుడు ప్రసాదించిన గుండె..
మీ దయగల హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు.. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు..
మీరు కలిగి ఉన్న ఐదవ సంపద, మీ శరీరం..
ఈ శరీరంతో మీరు ఇతరులకొరకు అనేక మంచి పనులు చేయగలరు.. అవసరమైన వారికి, చేతనైన సహాయం చేయవచ్చు..
సహాయం చెయ్యడానికి డబ్బు మాత్రమే అవసరం లేదు..
ఒక చిన్న శ్రద్ధ, సంజ్ఞలు, జీవితాలను వెలిగించగలవు..
భగవంతుడు మనకిచ్చిన జీవితం, కలకానిదీ! విలువైనదీ! సర్వోత్తమమైనదీ!
ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికీ చేతనైన సహాయం చేస్తూ, జన్మను చరితార్థం చేసుకోవడమే మానవ జన్మకు సార్థకత..
సర్వేసంతు సుఖినః - సర్వేసంతు నిరామయా!
సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి!
Link: https://www.youtube.com/post/Ugyrk99vDCHNfDh4J7R4AaABCQ