ప్రతిఫలం ఎలా అందుతుంది?
తండ్రీ కొడుకులు కలసి వ్యవసాయం చేసేవారు.
అడిగిన వారికి అన్నం పెట్టి అన్నదాత అనిపించుకున్నాడు తండ్రి. అర్ద రాత్రి ఎవరికైనా జబ్బు చేస్తే, బండి కట్టి పట్నంలో ఆసుపత్రికి చేర్చేవాడు.
తండ్రి పద్దతులు కొడుకు సూరికి నచ్చేవి కావు.
'ఎందుకు పరాయి వాళ్ళ కోసం అలా పాకులాడతావు? మనకు అవసరం పడితే, ఒక్కడూ ముందుకు రాడు. మొన్న నా కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఒక్కడూ బండెక్కించుకోలేదు. కృతజ్ఞత లేని వారికోసం పాటుబడటం శుద్ధ దండగ' అని కోపగించుకునేవాడు.
కొడుకు మాటలకు నొచ్చుకుంటూ 'ప్రతిఫలం ఆశించి చేసేది సహాయం అనిపించుకోదు' అని సర్ది చెప్పేవాడు.
ఓరోజు సూరి పొలం వెళ్ళే సరికి, ఎవరివో పశువులు తమ పొలంలో పడి మేస్తున్నాయి.
పక్కపొలం సుబ్బయ్య చూచీ చూడనట్టు వున్నాడు. వళ్ళు మండి తనే తరుము కున్నాడు.
నాలుగు రోజుల తరువాత పంపు విరిగి పండిన సుబ్బయ్య చేలోకి నీరు పోసాగాయి.
అది చూసిన తండ్రి పంపు కట్టేసి రమ్మన్నాడు కొడుకును.
నాలుగు రోజుల క్రితం జరిగింది చెప్పాడు కొడుకు.
'ఎవడి పాపాన వాడు పోతాడు. కోత కొచ్చిన పంట తడిచిపోతే, పాడయిపోతుంది. చూస్తూ వుంటే వాడికీ మనకూ తేడా ఏముంటుంది?' కోపంగా అన్నాడు.
తండ్రి చెప్పినట్టే చేశాడు.
ఆ ఏడు పంటలు బాగా పండాయి. వడ్లు బస్తాలకెత్తి , ఇంటికి చేర్చాడు కొడుకు.
ఊరెళ్ళిన తండ్రి అప్పుడే వచ్చాడు.
ఎద్దుల గంగ డోలు నిమురుతూ 'నాన్నా! ధాన్యం బస్తాలు బండికెత్తి దారిన వస్తుంటే, రెండు చక్రాలు గుంటలో ఇరుక్కు పోయాయి. బండి బరువుకు వెనక్కి వాలి, ముందు భాగం లేచింది. ఎద్దులు పైకి లేచాయి. వాటి కుత్తుకల దగ్గర బిగుసుకుంది. తనకలాడుతున్నాయి. నేనొక్కడినే ఉన్నాను. ఏం చేయాలో పాలుపోలేదు.
అంతలో ఆ దారిన పోతున్న పెళ్ళి బృందం, గబగబా వచ్చి, ఎద్దులను పట్టుకుని పైకెత్తారు. నేను వాటి మెడతాళ్ళు తప్పించాను. ఈ రోజు ఎద్దుల ప్రాణాలు గట్టివి' అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు కొడుకు.
'చూశావా! భగవంతుడు ఎంత సహాయం చేశాడో! నీవు సహాయం చేసిన వాళ్ళే నీకు సహాయం చేయాలని లేదు. నువు ఎవరికి మంచి చేసినా, దేవుడు నీ ఖాతాలో వేస్తాడు. పెళ్ళి వారికి నువ్వేం సాయం చేశావని వాళ్ళు కాపాడారు. ప్రతి ఫలం ఆశించక, పదిమందికీ సాయం చేస్తే, అదే మనల్ని కాపాడుతుంది.'
ఇంతకాలం మొండిగా వాదించి నందుకు తండ్రిని మన్నించమని కోరాడు కొడుకు..
ధర్మో రక్షతి రక్షితః
[ స్నేహ బంధం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/v5BseWhhnPM ]
[ అమృత హస్తం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/RZ2Q8KqiXYc ]
[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]
[ మనిషికుండవలసిన లక్ష్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]
[ మనిషికుండే నిరాశ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]
[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]
[ కదిలిపోయేదే కాలం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/9kQuLJAe4-A ]
[ నవరసభరితం - నరుడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/HKkTaHJflj8 ]
[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]
[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]
[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]
[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]
[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]
[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/JFLTERF-L2w ]
[ మనిషి జయించవలసిన '6 దోషాలు' – విదుర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/vu76U3f7LJ4 ]