Ads

Showing posts with label నాలుగు మంచి మాటలు!. Show all posts
Showing posts with label నాలుగు మంచి మాటలు!. Show all posts

13 February, 2021

నాలుగు మంచి మాటలు!


నాలుగు మంచి మాటలు!

సాధనలో అహం పెరగకుండా, వినయం పెరగడం ఉత్తీర్ణతకు గుర్తు!

గురువు సత్యాన్ని గుర్తు చేస్తాడు.. సద్గురువు సత్యాన్ని గుర్తుపట్టేలా, గుర్తుండేలా చూస్తాడు..

[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]

మనలో భక్తీ, సాధనా పెరుగుతుందంటే, శాంతి, వినయం పెరగాలి. మనం సత్యానికి దగ్గరవుతున్నాం అనటానికి అదే గుర్తు.

భౌతిక జీవనంలో డబ్బు, కీర్తి, పాండిత్యం పెరిగితే, సాధారణంగా అహంకారం పెరుగుతుంది. 

అవి పెరిగినా, అహం పెరగకపోవడమే ఉత్తమ జీవనం అవుతుంది.

ఆధ్యాత్మిక మార్గంలో కూడా సాధన పెరిగే కొద్ది సిద్ధులు, శక్తులు, సంకల్ప బలం పెరిగి, అహం పెరుగుతుంది.

సాధన పెరిగే కొద్దీ, అహం పెరగకుండా, శాంతి మరియు వినయం పెరగడం ఉత్తీర్ణతకు గుర్తు..

దైవసంకల్పం లేకుండా, ఒక గడ్డిపోచ అయినా కదలదు.

ఒక జీవుడికి మంచిరోజులు వచ్చినపుడు, అతడి ఆలోచనలు అతణ్ణి ప్రార్థనకు పురికొల్పుతాయి.

అదే చెడ్డ రోజులు దాపురించినపుడు, అతని ఆలోచనలన్నీ చెడుదారిన పడతాయి.

గొంగళి పురుగు అని అసహ్యించుకున్నవారు, సీతాకోకచిలుకలా మారిన తరువాత వర్ణించడానికి మాటలు వెతుకుతుంటారు..

మనిషి జీవితం కూడా అంతే.. కష్టపడుతున్నప్పుడు రాని ఎవరూ.. నువ్వు సుఖపడుతున్నప్పుడు, వెతుక్కుని మరీ వస్తారు..

మనం చేసే ప్రతి పనిని ధర్మం కనిపెడుతూనే ఉంటుంది.. అన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు..

అంతరాత్మ పరిశీలిస్తూనే ఉంటుంది.. ఇక పగలు..రాత్రి.. సూర్యుడు.. చంద్రుడు ఉండనే ఉన్నాయి..

ఇన్నిటి ఎదుట మనం ఏదైనా తప్పు చేస్తున్నామంటే, అది ఆత్మవంచనే అవుతుంది..

నీ విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో.. స్ఫూర్తితో వారు నిన్ను అనుసరిస్తారు..

నీ ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో.. అనుభవంతో వారు నీకు బోధిస్తారు..

నిన్ను కొనబోయేది నేనేనని, ఎకరాలు ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి, 

స్మశానం నవ్వింది.. నీకు ఇవ్వబోయేది ఆరడుగులేనని..

ఆశ ఉన్నవారు, ఆనందంలో మాత్రమే బ్రతకగలరు.. ఆశయం ఉన్నవారు, బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు..

తెలివికి నిదర్శనం తప్పులు వెదకడం కాదు, పరిష్కారాలను సూచించగలగడం..

విలైతే నలుగుకీ సాయం చేయి.. గొప్పలు చెప్పకు.. ఎవరినీ తక్కువచేసి మాట్లాడకు.. నిజాలు మాట్లాడు..

అబద్ధాలతో అందమైన జీవితం ఊహించుకోకు.. ఇంకొకరితో పోల్చుకుని, మనశ్శాంతిని కోల్పోకు..

మంచిమాట వీడియోలు:

[ స్నేహ బంధం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/v5BseWhhnPM ]

[ అమృత హస్తం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/RZ2Q8KqiXYc ]

[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]

[ మనిషికుండవలసిన లక్ష్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]

[ మనిషికుండే నిరాశ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]

[ కదిలిపోయేదే కాలం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/9kQuLJAe4-A ]

[ నవరసభరితం - నరుడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/HKkTaHJflj8 ]

[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]

[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]

[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]

[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]

[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]

[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/JFLTERF-L2w ]

[ మనిషి జయించవలసిన '6 దోషాలు' – విదుర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/vu76U3f7LJ4 ]

Link: https://www.youtube.com/post/Ugz09zWQxwzdDBGzS6B4AaABCQ