దైవ సాక్షాత్కారం!
ఒక ఊరిలో వున్న గుడిలో జరగబోయే ప్రవచనానికి, పురాణ శ్రవణానికి రావలసిందిగా ఆ దేవాలయ అర్చకుడు, ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే, అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడు.. 'వచ్చి ఏమి సాధించేది వుంది? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం, పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను.. ఒక్కటైనా గుర్తుందా? అందుకే దేవస్థానానికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప, ఒరిగేదేమీ లేదు..'
[ శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిన సన్యాసి ‘లక్ష్యం’ - 4 హత్యలు! = https://youtu.be/nxAY2zJ4tZw ]
అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు.. నాకు పెళ్ళయ్యి ముప్పై ఏళ్ళయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం ముప్పై రెండు వేల సార్లు భోజనం వండి వడ్డించి వుంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో, నాకు ఒక్కటైనా గుర్తుందా? కాని నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే, ఆమె వండిన భోజనం నుండి నేను శక్తిని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండి పెట్టక పోయివుంటే, నాకు ఆ శక్తి ఎక్కడిది? ఈ పాటికి చనిపోయి వుండే వాడిని..
అందుకే.. శరీరానికి భోజనం / ఆహారం ఎలాగో, అలాగే, మనసుకు భగవన్నామ స్మరణ అవసరం, శరీరానికి దీనజన సేవ అవసరం, చేతులకు దాన గుణం అవసరం.. ఇవన్నీ నిరంతరం చేస్తూనే వుండాలి.. మనిషి జన్మకు ఒకే ఒక్క లక్ష్యం.. అదే, దైవ సాక్షాత్కారం అంటుంది భగవద్గీత కూడా..
Link: https://www.youtube.com/post/UgyPET_uXG3jp4bBhR94AaABCQ