ఏ సమస్యలకు ఎలాంటి లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని పెట్టుకోవాలి?
వాస్తు శాస్త్రం అనేది, శిల్పకళా విజ్ఞాన శాస్త్రంలో ఒక భాగం. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువూ, ఒక నిర్దిష్ట శక్తి, అంటే, Aura ని కలిగి ఉంటుందని, మన వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. ఈ Aura, ఒక వస్తువు చుట్టూ సృష్టించబడిన వాతావరణాన్ని సూచిస్తుంది. ఈ వాతావరణం, సానుకూల లేదా ప్రతికూలమైన కొన్ని తరంగాలను కలిగి ఉన్న శక్తుల నుండి, రూపొందించబడుతుంది. తద్వారా, ఇది పరిసరాలను ప్రభావితం చేస్తుంది. ఒక నిర్మాణం, వాస్తు శాస్త్ర సూచనల ప్రకారం జరగనప్పుడు, అక్కడ ప్రతికూల శక్తుల సంచారం అధికమై, మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. అటువంటి పరిస్థితులకు పరిష్కారంగా, వాస్తు శాస్త్రం కొన్ని అంశాలను సూచిస్తోంది. వాటిని ఇంట్లో ఉంచుకోవడం వలన, ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/rlzE8NcsoyY ]
వాస్తు శాస్త్రం ఆమోదించిన, తప్పక ఇంట్లో ఉండాల్సిన వస్తువు, లాఫింగ్ బుద్ధా. అందుకే చాలామంది, తమ ఇళ్ళల్లో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని తప్పక పెట్టుకుంటారు. ఎందుకంటే, జీవితంలో ఆనందంతో పాటు, శాంతీ, శ్రేయస్సూ, ఈ లాఫింగ్ బుద్ధా కలుగజేస్తుందన్న నమ్మకం. వాస్తుశాస్త్రం, ఫెంగ్ షూయ్ ప్రకారం, నవ్వుతున్న బుద్ధుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ విగ్రహాం, అదృష్టానికి సంకేతం. కాబట్టి, ఇంట్లో, కార్యాలయాలలో ఎక్కడైనా, ఈ నవ్వుతున్న బుద్దుడిని పెట్టుకోవచ్చు. కానీ, సరైన ప్రదేశంలో, తగిన దిక్కున మాత్రమే ఉంచాలి. దీనిని మన దగ్గర ఉంచుకోవడం వలన, ఎంచుకున్న రంగంలో విజయం కలుగుతుంది. ప్రతికూల శక్తి, తగ్గుతుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. సంతోషం, మానసిక శాంతీ, వెల్లివిరుస్తాయి. సంతాన యోగం కూడా కలుగుతుంది. అయితే, మనకు ఈ ఫలాలు కలగాలంటే, అందుకు తగిన లాఫింగ్ బుద్ధాను మాత్రమే పెట్టుకోవాలి. ఒక్కో అవసరానికి, ఒక్కో ఆకారంలో ఉన్న విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఈ రోజుటి మన వీడియోలో, ఏ ఫలితాలు పొందాలంటే, ఏ విగ్రహాన్ని పెట్టుకోవాలి? దానిని ఏ స్థానంలో పెడితే ప్రయోజనముంటుంది? అనేటటువంటి విషయాలను తెలుసుకుందాము..
1. లాఫింగ్ బుద్ధా విగ్రహం
ఇంట్లో ప్రశాంతత కరువై, కుటుంబ సభ్యుల మధ్య తరచూ కీచులాటలూ, వాదనలూ జరుగుతున్నట్లైతే, మీ ఇంటి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇది సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచుతుంది. ఉద్యోగ ప్రాంతంలో, తోటి సహోద్యోగులతో సమస్యలు ఉన్నట్లతే, అక్కడ కూడా తూర్పు దిశలో ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం వలన, ప్రశాంతత కలుగుతుంది.
2. డబ్బు మూటలతో ఉన్న లాఫింగ్ బుద్ధా విగ్రహం
ఈ విగ్రహం మన ఉద్యోగ అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారు, ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని పెట్టుకోవాలి. అలా చేస్తే త్వరలోనే మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. అంతేకాదు, ఆగ్నేయ దిశలో ఉండడం వలన, ఇంట్లో ధనానికి కొరత లేకుండా ఉంటుంది.
3. డ్రాగన్ తో ఉన్న లాఫింగ్ బుద్ధా విగ్రహం
మీపై చెడు దృష్టి పడి, ప్రతీ పనిలో ఆటంకాలూ, అనవసర సమస్యల్లో చిక్కుకుంటే, ఇంట్లోకి వచ్చేవారికీ, ఇంటి గుమ్మం దగ్గర నుండి వెళ్ళేవారికీ కనపడే రీతిలో, హాల్ లో ఎదురుగా, అందరి దృష్టీ పడే విధంగా పెట్టండి. దీని వలన మీకు పురోగతి కనిపిస్తుంది.
4. చేతులు పైకెత్తి ఉన్న లాఫింగ్ బుద్ధా విగ్రహం
వ్యాపారస్థులకు నష్టాలు వస్తున్నా, దుకాణదారులకు సమస్యలు ఎదురైనా, లాఫింగ్ బుద్ధాను తప్పక పెట్టుకోవాలి. ఈ విగ్రహాన్ని దుకాణ ప్రధాన ద్వారం వద్ద, ఆఫీస్ రిసప్షన్ లో ఎదురుగా ఉంచడం వలన, మీ స్థితి మారుతుంది.
5. పిల్లలతో కలిసి ఉన్న లాఫింగ్ బుద్ధా విగ్రహం
సంతానం లేని వారు, లాఫింగ్ బుద్ధాను ఒక అదృష్ట వస్తువుగా భావించవచ్చు. చిన్న పిల్లలతో కలిసి నవ్వుతూ ఉండే బుద్ధుడిని గనుక మీ పడక గదిలో ఉంచుకుంటే, తప్పక సంతానం కలుగుతుంది.
ఇన్ని లాభాలనిచ్చే, ఈ లాఫింగ్ బుద్ధుడిని, వంటగదిలో గానీ, బాత్రూమ్ ప్రక్కన గానీ ఉంచకూడదు. అలా చేయడం వలన, ప్రయోజనాలకు బదులు, ప్రతికూలతలు ఎదురవుతాయి. ఈ లాఫింగ్ బుద్ధా విరిగినట్లయితే, అది తన చుట్టూ ఉండే శక్తిని కోల్పోతుంది. అది ఒక సాధారణ వస్తువుగా ఉంటుందే తప్ప, ఎటువంటి ప్రయోజనాన్నీ కలిగించదు. కాబట్టి, మీ సమస్యలకు తగిన నవ్వుతున్న బుద్ధుడిని తెచ్చి పెట్టుకోండి. మంచి ఫలితాలను పొందండి.
సర్వేజనా: సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgyGc_Sa7fRjLdpmM4h4AaABCQ