అన్యధా శరణం నాస్తి! నమ్మకమా? విశ్వాసమా?
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరాత్పర॥
[ మనిషికుండవలసిన లక్ష్యం! = https://youtu.be/laB5lI-sf2Q ]
ఎత్తయిన రెండు భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది..
దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు..
వందల అడుగుల ఎత్తున, అతను అత్యంత జాగ్రత్తగా నడుస్తున్నాడు..
చేతిలో పొడవైన కర్ర ఉంది..
బుజాన అతని కొడుకు ఉన్నాడు..
అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు..
అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ, రెండవ భవనం వైపు వచ్చాడు..
అందరూ చప్పట్లు కొట్టారు..
కేరింతలతో ఆహ్వానం పలికారు..
చేతులు కలిపారు ఫోటోలు తీసుకున్నారు..
ఇంతలో అతను, నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలను కుంటున్నాను.. వెళ్లగలనా? అతను ప్రశ్నించాడు!
వెళ్లగలవు.. వెళ్లగలవు.. జనం ఏక కంఠంతో చెప్పారు సమాదానం..
నా మీద నమ్మకం ఉందా..?
ఉంది.. ఉంది.. మేం పందానికయినా సిద్దం..! సిద్ధం..!
అయితే మిలొ ఎవరయినా నా భుజం మీద ఎక్కండి.. అవతలికి తీసుకు పోతాను..!
నిశ్శబ్దం.. జనం మాటలు ఆగి పోయాయి..
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు..
ఉలుకూ పలుకూ లేదు..
నమ్మకం వేరు, విశ్వాసం వేరు..
విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి..
ఈ రోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇదే..
దేవుడు అంటే నమ్మకమే కానీ, విశ్వాసం లేదు..
Link: https://www.youtube.com/post/Ugw8u2jTnDKh7JwF4wB4AaABCQ