'సమాధి'!
యోగంలో శరీరాన్ని మరచి ఉండటమే 'సమాధి'!
సకలేంద్రియాలూ పనిచేస్తుండగానే, ఎప్పుడూ సమాధిలో ఉండడం..
దీనిని 'సహజ సమాధి' అంటారు..
నీవు సమస్త కార్యాలూ చేస్తున్నప్పటికీ, శాంతితో, నిలకడ కలిగిఉంటావు..
అంతరాత్మ ప్రేరితుడవై చరిస్తున్నావని గుర్తించగలుగుతావు.. అందువల్ల, ఏమి చేస్తున్నా, ఏమి తలుస్తున్నా, అవి నిన్ను అంటవు.. నీకు చింతలుండవు..
ప్రతి పనీ, వేరైయున్న ఒక వస్తువు చేత జరపబడుతుంది.. ఆ గొప్ప వస్తువుతో నీవు ఏకమై ఉంటావు..
'నాది' అనేది అర్పించటం, చిత్తశుద్ధిని యిస్తుంది.
'నేను'ను అర్పించటం, జ్ఞానాన్ని యిస్తుంది.
సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgxH1iFiUpAd07UCryF4AaABCQ