క్షేత్రము - చిదంశ!
'తత్వమసి' అంటే 'ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు' అని.. ఇక్కడ 'నీవు' అంటే, జీవుడు అని గనుక, ఈ జీవుడు ఆ పరమాత్మే అని.. పరమాత్మ సర్వవ్యాపి, ఆనంద స్వరూపుడు, అనంతుడు, సర్వజ్ఞుడు..
మరి జీవుడేమో పరిమితుడు, దుఃఖాలతో కూడినవాడు, కించిజ్ఞుడు.. మరి ఇద్దరూ ఒకటే అని చెప్పాల్సి వస్తే, ఆ తేడాలు తొలగిపోవాలి.. అవి ఎలా తొలగిపోతాయి..?
ఇక్కడ 'జీవుడు' అంటే, ఈ దేహ మనో బుద్ధులకు ఆధారంగా ఉన్న 'చిదంశ'. నీవు ఆలోచనలు చేస్తున్నావంటే, అలా చెయ్యటానికి కావలసిన శక్తి ఎక్కడి నుండి వస్తున్నది..? అది నీలో నుండే వస్తుండాలి..
అలా నీలోనే, అంటే, నీ దేహంలోనే ఉంటూ, నీకు శక్తి నిచ్చేదే 'చిదంశ'. అంటే, 'జీవుడు' అనే దానిలో, రెండు అంశాలున్నాయి. ఒకటి 'క్షేత్రము', రెండవది 'చిదంశ'. క్షేత్రం అనే దానిని తొలగించి, ఈ 'చిదంశ'నే జీవుడిగా గ్రహిస్తే, ఈ చిదంశా, ఆ పరమాత్మ నుండి వ్యక్తమయ్యే చిదంశా, రెండూ ఒక్కటే అని అర్థమైపోతుంది..
శుభం భూయాత్!
No comments:
Post a Comment