శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం..
1. శ్రీకృష్ణుడు 5,249 సంవత్సరాల క్రితం జన్మించాడు.
2. పుట్టిన తేది సా.శ.పూ. 18.07.3228 (3228 B.C.E).
3. మాసం: శ్రావణం.
4. తిథి: అష్టమి.
5 . నక్షత్రం: రోహిణి.
6. వారం: బుధవారం.
7. సమయం: రాత్రి గం.00.00 ని.
8 జీవిత కాలం : 125 సంత్సరాల, 8 నెలల, 7 రోజులు.
[ విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు! = https://youtu.be/q7OQVyx4sU4 ]
[ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! = https://youtu.be/AbSSImIw2-4 ]
[ శ్రీ కృష్ణుడు జన్మించిన రాత్రి సంభవించిన విచిత్ర సంఘటనలు! = https://youtu.be/-X6UbycGTdI ]
[ శ్రీ కృష్ణుడి అష్టభార్యల పరిణయం వెనుక దాగిన రహస్యాలు! = https://youtu.be/IKbw0J6koIU ]
[ ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? = https://youtu.be/451l4ymbZFs ]
9. అవతార పరిసమాప్తి: సా.శ.పూ. 18.02.3102 (3102 B.C.E).
10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది.
11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత అవతార పరిసమాప్తి గావించాడు.
12. కురుక్షేత్రం సా.శ.పూ. 08.12.3139 న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. సా.శ.పూ. 21.12.3139 న, 3 గం. నుంచి 5 గం.ల వరకు సంభవించిన సూర్య గ్రహణం, జయద్రదుని మరణానికి కారణమయ్యింది.
13. భీష్ముడు సా.శ.పూ. 02.02.3138 న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచాడు.
14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో, వివిధ నామాలతో పూజిస్తారు. అవి:
మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల (విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాధీసుడు & రాంచ్చోడ్
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ
15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు.
16. జన్మనిచ్చిన తల్లి దేవకి.
17. పెంచిన తండ్రి నందుడు.
18. పెంచిన తల్లి యశోద.
19. సోదరుడు బలరాముడు.
20. సోదరి సుభద్ర.
21. జన్మ స్థలం మధుర.
22. భార్యలు: రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ.
23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు: చాణూర - కుస్తీదారు, కంసుడు - మేనమామ, శిశుపాలుడు మరియు దంతావక్రుడు - అత్త కొడుకులు..
24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.
25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.
26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన, శ్రీకృష్ణుని 9వ ఏట, గోకులం నుంచి బృందావనానికి మారవలసి వచ్చింది.
27. 14-16 ఏళ్ల వయసు వరకు, బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని, 14-16 వయస్సులో మధురలో చంపి, తనను కన్న తల్లిదండ్రులకు చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
29. కాలయవన అనే సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన, మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
30. వైనతేయ తెగకు చెందిన ఆటవికుల సహాయంతో, జరాసంధుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
31. శ్రీకృష్ణుడు ద్వారకను పునర్నిర్మించాడు.
32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు, 16-18 ఏళ్ల వయసులో, ఉజ్జయినీలో గల సాందీపని మహర్షి యొక్క అశ్రమానికి తరలివెళ్ళాడు.
33. గుజరాత్ లో గల ప్రభాస అనే సముద్రతీరం వద్ద, ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి, అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడాడు.
34. తన విద్యాభ్యాసం తరువాత, పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని, వారిని లక్క ఇంటి నుంచి కాపాడి, తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించాడు.
35. పాండవులకు ఇంద్రప్రస్థ నగరాన్ని ఏర్పాటుచేసి రాజ్యాన్ని ఏర్పాటుజేశాడు.
36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు.
37. రాజ్యము నుండి వెళ్లగొట్టబడినప్పుడు, పాండవులకు తోడుగా నిలిచాడు.
38. పాండవులకు తోడుగా ఉండి, కురుక్షేత్రంలో విజయాన్ని వరించేటట్లు చేశాడు.
39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నీట మునిగిపోవడం, స్వయంగా చూశాడు.
40. అడవిలో జర అనే వేటగాడి బాణం వలన అవతార పరిసమాప్తి గావించాడు.
41. శ్రీకృష్ణుడి జీవితం పూలపానుపు కాదు. జీవితంలో ఒక్క క్షణం కూడా, ఎటువంటి సంఘర్షణా లేకుండా, ప్రశాంతంగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో, సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
43. జీవితములో ప్రతీ వ్యక్తినీ, ప్రతీ విషయాన్నీ బాధ్యతతో ఎదుర్కొని, చివరకు దేనికీ / ఎవరికీ అంకితమవ్వలేదు.
ఆయన గతాన్నీ, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడైనప్పటికీ, తను ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతికాడు.
44. శ్రీకృష్ణుడు ఇంకా ఆయన జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.
[ శ్రీమద్ భగవద్గీత = https://bit.ly/3zoQITI ]
కృష్ణం వందే జగద్గురుం!
Link: https://www.youtube.com/post/UgyDE0CcwSg3b41QcBJ4AaABCQ
No comments:
Post a Comment