Ads

12 April, 2021

ప్లవ నామ సంవత్సర ఉగాది - Plava New Year

 


ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం 🙏 

రేపు సూర్యోదయానికి పాడ్యమి ఉంటుంది గనుక రేపు 13.04.2021న 'ఉగాది' 

వికారినామ సంవత్సరము (2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది..

[ 'ఉగాది పండుగ' వెనుక అసలు చరిత్ర! = https://youtu.be/PNwsSBE8SQc ]

శార్వరి (అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది..

ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం. కారణం? ప్లవ అంటే, దాటించునది అని అర్థం. 
'దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం..' దుర్భరమైన ప్రతికూలతను దాటించి, భూమికి శోభను చేకూరుస్తుంది.. అని, వరాహ సంహిత వివరించింది. అంటే, చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం..

వికారి, శార్వరి, తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా.. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం, తర్క సహితమైన ఆలోచనేకదా..

ప్లవ నామ సంవత్సరం ముగియగానే, 'శుభకృత్', ఆ తరువాతది 'శోభకృత్' సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా, ఇవి కూడా మన మనసుకు సంతోషాన్నీ, వికాసాన్నీ కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి..

అందుకే, ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం!
 
ముందుగా మీకూ మీ కుటుంబ సభ్యులకూ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు..

No comments: