దశావతారాల నుంచి మనం నేర్చుకోవలసినవి!
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।। 7 ।।
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।
మన పురాణాల ప్రకారం, త్రిమూర్తులలో విష్ణువు లోక పాలకుడు. సాధు పరిరక్షణ కొఱకూ, దుష్ట శిక్షణ కొఱకూ, యుగయుగాలలో, ఆయన ఎన్నో అవతారాలనెత్తాడు. అలాంటి అవతారాలలో, 21 ముఖ్య అవతారాలను, ఏకవింశతి అవతారములు అంటారు. వాటిలో అతిముఖ్యమైన 10 అవతారాలను, దశావతారాలు అంటారు.
[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]
1. మత్స్యావతారం (చేప)
నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో 'ప్రతికూల పరిస్థితుల్లో'నూ సంసారాన్ని ఈదాలి..
2. కూర్మావతారం (తాబేలు)
అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి 'ధ్యానం' చేయాలి..
3. వరాహావతారం (వరాహం)
ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో, అలాగే 'ఇంటి బాధ్యత'లను మోయాలి..
4. నరసింహావతారం (మనిషి శరీరం, సింహం తల)
మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి..
5. వామనావతారం (మరుగుజ్జు)
మొదటి అడుగు భౌతికంగానూ,
రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ,
మూడవ అడుగును మనలోని 'అహంకారాన్ని' గుర్తించి 'బలి' ఇవ్వాలి..
6. పరశురామావతారం
'లక్ష్యం' కోసం, పట్టుదలతో ముందుకు సాగాలి..
7. రామావతారం
'ధర్మ'యుతంగా జీవించాలి..
8. కృష్ణావతారం
ఎన్ని కష్టాలు ఎదురైనా, నవ్వుతూ 'ఆనందం'గా ఉండాలి..
9. బుద్ధావతారం
'జ్ఞానాన్ని' పంచాలి..
10. కల్కి అవతారం
సకల మానవాళి అజ్ఞానాన్నీ తీసివేయాలి..
సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgzTcdG7a1hRmBrNBpV4AaABCQ
No comments:
Post a Comment