ఏకదండి.. ద్విదండి.. త్రిదండి అంటే ఏమిటి?
సన్యాసులూ, స్వామీజీలూ, వైరాగ్యానికీ, తాత్వికతకూ, ద్వైత, అద్వైత భావానికీ గుర్తుగా, చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు.. ఈ (దండాలు) కర్రలు, వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికీ ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి. కాబట్టి, సన్యాసులు ఐదడుగుల కర్రను ధరిస్తారు. ఈ కర్రలలో, ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలున్నాయి. ఇక్కడ దండి అంటే కర్ర అని అర్థం..
ఏకదండి - ఒక కర్రను ధరించి ఉండేవారు, అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు. ఉదాహరణ, ఆది శంకరాచార్యులు.. అద్వైతం అనగా, జీవుడూ దేవుడూ ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా, అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా, ఆ పాప ఫలితాన్ని, బ్రతికి ఉండగానే, ఏదో ఒక రూపంలో, ఇక్కడే అనుభవించక తప్పదు.. అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది..
[ శ్రీమద్ ఆది శంకరాచార్యుల జీవిత రహస్యాలు = https://youtu.be/srTCWknBC7Q ]
ద్విదండి - రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి, ధరించి బోధనలు చేసేవారు, ద్వైత సిద్ధాంతంగలవారు. ఉదాహరణ, మధ్వాచార్యులు.. వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు. వీరు విష్ణు భక్తులు. వీరు దేవుడు వేరు, జీవుడు వేరు, అని బోధిస్తారు. జీవాత్మా, పరమాత్మా వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే, శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు..
[ మధ్వాచార్యులు స్థాపించిన కృష్ణ మందిరం = https://youtu.be/451l4ymbZFs ]
త్రిదండి - మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు. దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు, విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర. శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా, శ్రీమన్నారాయణుడు ఉంటాడనీ, జీవాత్మా, పరమాత్మా, ప్రకృతీ సత్యాలనీ, ఈ మూడింటినీ, నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో, సంసార బంధాన చిక్కుకుంటాడనీ, నారాయణుని శరణు వేడిన వారు, భగవదనుగ్రహం వలన, అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం, నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారనీ, వారికి మరుజన్మ ఉండదనీ విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు..
[ వెయ్యేళ్ల నాటి రామానుజాచార్యుల దేహం! = https://youtu.be/Ag0Uayj7C-c ]
Link: https://www.youtube.com/post/UgxlRa6HGtfUb_LXMQp4AaABCQ
No comments:
Post a Comment