నేటికీ కొనసాగుతున్న అశోకుడి 9 మంది రహస్య సంఘం!
మనిషి ఆది మానవుడి స్థితి నుంచి, ఆధునిక మానవుడి స్థాయికి ఎదిగే క్రమంలో, ఎన్నో విషయాలను మధించి, కొన్ని శాస్త్రాలను వెలికి తీశాడు.. ఈ శాస్త్రాలలో కొన్ని, మనిషి అభివృద్ధికి తోడ్పడితే, మరికొన్ని, వినాశనానికి కారణమవుతున్నాయి.. ఆ శాస్త్రాలను దాచిపెట్టడం తోపాటు, మానవాళిని రక్షించడానికి కొన్ని రహస్య సంఘాలు ఏర్పడితే, మరికొన్ని నాశనం చేయడానికి ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని పురాతన సంఘాలు, ఇప్పటికీ రహస్యంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటే, కొన్ని కాలగమనంలో కలిసిపోయాయి. అటువంటి వాటిలో 'Illuminati, The Skull and Bones, The Rosicrucians, The Knights Templar' అనే సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, ఈ రహస్య సంఘాలన్నీ 15, 16 శతాబ్దాల మధ్యలో ఆరంభమైనవే. కానీ, పాశ్చాత్యులకు రహస్య సంఘాలు అనే పదం తెలియక మునుపే, అఖండ భారతావనిని ఏలిన ఒక చక్రవర్తి, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రహస్య సంఘాన్ని ఏర్పాటు చేసి, అతి పురాతనమైన, శక్తివంతమైన విజ్ఞాన భాండాగారాన్ని, దుష్టుల చేతిలో పడకుండా రక్షణ కల్పించాడు. అసలు ఎవరా భారత చక్రవర్తి? అతను ఎందుకని ఈ రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు? అందులో ఎంత మంది సభ్యులు ఉన్నారు? వారి వద్దనున్న ఆ విజ్ఞానం ఏంటి? అనే విషయాలు, నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/-wMOVPj2sIA ]
అఖండ భారతావనిని ఏలిన మహా చక్రవర్తి, మౌర్య సామ్రాజ్య అధిపతి అశోకుడు. ఈయన సామాన్యశకానికి పూర్వం, 268 నుంచి 232 వరకు పాలించినట్లు, చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈయన మౌర్య సామ్రాజ్యాన్ని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బెంగాల్, అస్సాంతో పాటు, దక్షిణ భారత దేశంలో మైసూర్ వరకు విస్తరింపజేసి, ఈ భరతగడ్డను ఏలిన వారిలో ఒక గొప్ప చక్రవర్తిగా నిలిచారు. ఆయన రాజ్య విస్తరణలో భాగంగా, ఎన్నో ప్రాచీన గ్రంథాలను అవపోసన బట్టి, వాటి సహాయంతో కొత్త కొత్త యుద్ధ యంత్రాలూ, తంత్రాలూ సృష్టించి, తనకి కదన రంగంలో తిరుగులేకుండా చేశాడు. అయితే, అశోకుడి తండ్రి అయిన బిందుసారుడి చిరకాల కోరిక, కళింగను జయించడం. తండ్రి కోరిక నెరవేర్చడానికి, అతి బలమైన కళింగ రాజ్యంపై దండెత్తి, తన వశం చేసుకున్నాడు. అయితే, ఈ యుద్ధంలో తన సైన్యం సుమారు పది వేల మందికి పైగా చనిపోతే, కళింగ సైనికులు, ప్రజలు, సుమారు లక్ష మంది వరకు చనిపోయారు. రక్తపుటేరులై ప్రవహించిన రణరంగం చూసిన అశోకుడికి, మనసు చలించిపోయింది. ఎటు చూసినా పీనుగుల గుట్టలు, అశోకుడిని రాజ్యవిస్తరణ కాంక్షనుంచి, వైరాగ్యం వైపు నడిపించాయి..
ఈ కళింగ యుద్ధం వల్ల జరిగిన నష్టం మళ్లీ జరగకూడదని భావించి, ఆయుధాన్ని వదిలి, బౌద్ధమతాన్ని స్వీకరించాడు. రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూనే, శాంతి స్థాపనకు అమోఘ కృషి చేశాడు. ఈ క్రమంలో ఆయన ఏర్పాటు చేసిన సంఘమే, అశోక నవ రహస్య సంఘం. ఈ సంఘంలో, మొత్తం తొమ్మిది మంది అత్యంత ప్రతిభావంతులు ఉండేవారట. ఈ తొమ్మిది మందీ, మన ప్రాచీన గ్రంథాలను అవపోసన బట్టి, వాటిలోని విజ్ఞానాన్ని దుష్టుల చేతిలో పడకుండా రక్షించడమే, వారు చేయవలసిన కార్యం. ఈ నవ రహస్య సంఘం, ప్రపంచం నలుమూలలకూ వెళ్లి, అతి రహస్య జీవనం సాగిస్తూ, అత్యంత విలువైన విజ్ఞాన భాండాగారాన్ని రక్షించినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, కాలగమనంలో మరుగున పడిపోయిన ఈ విషయాన్ని, Talbot Mundy అనే బ్రిటిష్ అధికారి, 1923లో వెలువరించిన 'The Nine unknown' అనే పుస్తకం వల్ల, ప్రపంచం మొత్తానికీ తెలిసింది.
ఈయన భారతదేశంలో బ్రిటిష్ అధికారిగా ఉన్న సమయంలో, మన దేశ చరిత్ర మీద ఎంతో అధ్యయనం చేశాడు. దాని ఫలితంగానే, అశోకుడి కాలంలో స్థాపించబడ్డ రహస్య సంఘం గురించిన కొన్ని నిజాలను, మన ముందుకు తీసుకు రాగలిగాడు. ఆయన రాసిన దాని ప్రకారం, ఈ తొమ్మిది మంది వద్ద, ఊహకందని అత్యంత అధునాతన విజ్ఞాన భాండాగారం ఉందనీ, వాటిని వారు తాళపత్రాల రూపంలో పొందుపరిచారనీ, ఆ పరిశోధనలు నేటి శాస్త్రవేత్తల వద్ద కూడా లేవనీ, ఆయన వివరించాడు. ఈ తొమ్మిది మందీ, ప్రాచీన విజ్ఞాన భాండాగారాన్ని తొమ్మిది అంశాలుగా విభజించి, వాటిని గ్రంథాలుగా మార్చి, ఒక్కొక్కరూ ఒక్కొక్క గ్రంథాన్ని రక్షించేవారు. వారు ఆ గ్రంథాలను రక్షించడమే కాకుండా, కాలానుగుణంగా వచ్చిన అంశాలను అందులో పొందుపరచాలని, వారి తరువాత తమకు నమ్మకస్తులైన వారు ఈ పనిని చేయాలని చెప్పినట్టు, Mundy వ్రాసిన పుస్తకంలో ఉంది. Mundy చెప్పినదాని ప్రకారం, ఆ తొమ్మిది మంది వద్దనున్న తొమ్మిది గ్రంథాల గురించి, ఇలా వివరించబడింది.
మొదటి గ్రంథంలో, మనసులతో చేయు యుద్ధం గురించిన సమాచారం ఉంది. దానిని ఇంగ్లీషులో 'Propaganda and Psychological Warfare' అంటే, ఎదుటి వ్యక్తులని మాటలతో వశపరుచుకుని, వారిని తమకు నచ్చినట్లు వినియోగించుకోవడం. ఈ విధంగా ప్రజలను మాటలతోనే వశపరుచుకుని, వారిని యుద్ధాలకూ, విపరీత కార్యాలకూ పురిగొల్పడం.
రెండవ గ్రంథంలో, శరీర ధర్మం గురించిన పూర్తి సమాచారం ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో, Physiology అని అంటారు. దీని ద్వారా మన శరీర నిర్మాణంపై పూర్తి పట్టుతో పాటు, కేవలం ఒక్క స్పర్శతో ఎంతటి వారినైనా చంపవచ్చు. ఈ విద్య ద్వారా, మనిషి నాడీ వ్యవస్థపై ఎలా దాడి చేస్తే ఏం జరుగుతుందో అనే విషయాలు, చాలా విపులంగా వివరించబడింది.
ఇక మూడవ గంధంలో, అతి సూక్ష్మ జీవ శాస్త్రం మరియు జీవ సాంకేతిక శాస్త్రం గురించిన వివరాలు ఉంటాయట. దీనిని ఇంగ్లీషులో మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ అంటారు. దీని ప్రకారం, సూక్ష్మజీవులపై పరిశోధన, వాటిలో మంచి వాటిని గుర్తించి, వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించడం లాంటి అనేక విషయాలపై సమగ్రంగా ఉందట.
నాల్గవ గ్రంధంలో, రసవాదం వాదం గురించి ఉందట. దీనినే ఇంగ్లీషులో, Alchemy అని అంటారు. ఇందులో సమస్త లోహాల గురించిన పూర్తి వివరణతో పాటు, ఒక లోహాన్ని మరో లోహంగా మార్చే ప్రక్రియ గురించి ఉందట. ఈ శాస్త్రాన్ని ఉపయోగించి, ఈ లోహాన్ని బంగారంగా మార్చవచ్చు.
5వ గంధంలో సమాచారం, అంతరిక్ష మరియు గ్రహాంతరవాసులతో సమాచారం గురించి వివరించబడింది. దీనిని ఇంగ్లీష్లో, Communication and Communicate with Extraterrestrials అంటారు. దీని సహాయంతో, దూర ప్రాంతాల్లో ఉన్న వారితో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు, గ్రహాంతర వాసులను ఎలా కలవాలి? వారితో ఏ విధంగా సంభాషించాలి? అనే విషయాలు తెలుసుకోవచ్చు.
ఆరవ గ్రంధంలో, భూమ్యాకర్షణ మరియు విమానాల తయారీ గురించి వివరించబడింది. దీనిని నేడు గ్రావిటేషన్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అని అంటున్నారు.
ఏడవ గ్రంథంలో అంతరిక్షం గురించిన వివరాలున్నాయి. ఈ గ్రంథం ఆధారంగా, అంతరిక్షం గురించి, విశ్వం ఏర్పడిన విధానం గురించీ వివరించబడింది. దీనినే కాస్మాలజీ అని నేడు అంటున్నారు. అంతేకాదు, ఈ గ్రంధం ద్వారా టైం ట్రావెలింగ్ ఎలా చేయాలి? Portals ఎలా ఏర్పడతాయి? వాటిని ఎలా మనకు ఉపయోగపడేలా వాడవచ్చు? అనే విషయాలు వివరించబడింది.
ఎనిమిదవ గ్రంథంలో, కాంతి గురించీ దాని వేగాన్ని మార్చే సాంకేతికత గురించీ వివరించబడింది. అంతేకాదు, కాంతినీ, వేగాన్నీ మనకి అనుకూలంగా మార్చుకుని, దానితో దాడి ఎలా చేయాలి? అనే విషయాలపై వివరంగా రాసి ఉందట.
ఇక ఆఖరి గ్రంధంలో సమాజ శాస్త్రం గురించి వివరించబడింది. ఈ గ్రంథం ఆధారంగా, మన సమాజం ఎలా ఉండాలనే నియమ నిబంధనలు, ప్రభువులు సమాజ అభివృద్ధి చేయడానికి కావలసిన మార్గదర్శకాలతో పాటు, రాజ్య పాలన గురించి వివరించబడింది. అంతే కాదు, ఇందులో ఏం చేస్తే సమాజం నాశనం అవుతుందో తెలిపే సమాచారం కూడా ఉందట.
So, ఇవి ఫ్రెండ్స్.. అశోకుడి తొమ్మిదిమంది రహస్య సభ్యుల వద్దనున్న గ్రంథాలలోని సమాచారం. ఈ తొమ్మిది మంది సభ్యులు, తమ వారసుల ద్వారా, వారి రహస్య కార్యకలాపాలను నేటికీ కొనసాగించేలా చేశారని, వారి వారసులు ఈ సమాచారం అత్యంత రహస్యంగా, వారి తరువాతి తరాల వారికి అందిస్తూ ఉంటారనీ, అందువల్ల అశోకుడు స్థాపించిన ఈ రహస్య సంఘం నేటికీ మనుగడలో ఉందనీ, చాలామంది బలంగా నమ్ముతున్నారు. కొన్ని విపత్కర పరిస్థితులలోనూ, కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు సమయంలో వీరు బయటకు వచ్చి, కొంత సమాచారాన్ని ఇచ్చారని కూడా చాలామంది నమ్ముతున్నారు. ఏది ఎలా ఉన్నా, ఈ తొమ్మిది మందికి సంబంధించిన విషయాలు, ఇంకా ఒక మిస్టరీగానే ఉండిపోయాయి.
[ 20 లక్షల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మొదటి గ్రంధం! = https://youtu.be/40259dhpZm4 ]
[ వినాయకుడి జీవితంలో మనలో చాలామందికి తెలియని రహస్యాలు! = https://youtu.be/rdp7kXnYowQ ]
No comments:
Post a Comment