Ads

01 February, 2021

శుక్లాంబరధరం విష్ణుం శ్లోకం అర్దం..! Shuklambaradharam Vishnum Shloka


శుక్లాంబరధరం విష్ణుం శ్లోకం అర్దం..!

శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే||

[ ప్రపంచంలోనే తొలి దుర్గామాత అష్టభుజ దేవాలయం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/RjjV4M57Unk ]

శుక్ల – స్వచ్చమైన

అంబర – ఆకాశాన్ని

ధరం – ధరించిన

విష్ణుం – సర్వవ్యాపకుడైన పరమాత్మ

శశివర్ణం – చంద్రుని వంటి కాంతి కలిగిన

చతుర్భుజం – నాలుగు వేదాలను, నాలుగు భుజములుగా కలిగినవాడు /  చతుర్విధ పురుషార్ధాలను ఇచ్చువాడు

ప్రసన్న వదనం – చిరునవ్వులొలికించి సిరివెన్నలలను చిందించు నగుమోముగలవాడు

ధ్యాయేత్ – ధ్యానం చేస్తున్నాను

సర్వ విఘ్నోప శాంతయే – సమస్త అడ్డంకులనూ శాంతింపజేయుటకు..

తెల్లటి వస్త్రాన్ని ధరించి, చంద్రునివంటి కాంతి కలిగి, ధర్మార్ధ కామ మోక్షములను నాలుగు శ్రుతులనే భుజాలుగా ధరించి, ప్రసన్న వదనం కలిగి, అంతటా వ్యాపించి ఉన్న ధర్మ స్వరూపుడైన పరమాత్మను, అన్ని అడ్డంకులనూ తొలగించి, శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్ధన..

ఇది వినాయకుడి ప్రార్ధనగా, మన అందరికీ తెలుసు. విఘ్నశబ్దం ఉందిగనుక, వినాయకుడి ప్రార్ధన అని అనుకుంటాము. కానీ, అంతటా వ్యపించి ఉన్న పరమాత్మను ప్రార్ధించే శ్లోకంగా, అర్ధం తెలిసినవారు అంగీకరిస్తారు..

శుక్లాంబర ధారిణిగా సరస్వతీదేవిని తలచి, ప్రార్ధించవచ్చు. గణేశుడు కూడా, ఈ శ్లోకం ద్వార పూజలు అందుకుంటాడు. నిజానికి ఇది ఒక మహా మంత్ర రాజం..

ఇది 32 బీజాక్షరాలు కలిగిన మహా మంత్రం.. ఇది పూర్ణ గాయత్రీ మంత్రంతో సమానం. పూర్ణగాయత్రికి కూడా 32 అక్షరాలే. ఈ బీజాక్షరాలలో 'శబ్ద శక్తి' ఉంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శ్రుతి. ఆ అద్వితీయమైన పరబ్రహ్మ అనుగ్రహప్రాప్తికై చేసే ఏకైక ప్రార్ధనా శ్లోకమిది..

'ఏకో దేవః సర్వ భూతేషు' అనే శ్రుత్యర్ధం తెలిస్తే, ఈ శ్లోకం మహా మంత్రమని తెలుస్తుంది.. సమస్త విఘ్న నివారిణి ఐన ఈ శ్లోకాన్ని జపిస్తే, ఎటువంటి ఆటంకాలూ ఉండవు.. సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgzaeaQacD0xCBe2PUB4AaABCQ

No comments: