Ads

02 February, 2021

దోషాలను నివారించే గోమతి చక్రాలు! Gomati Chakra


దోషాలను నివారించే గోమతి చక్రాలు!

గోమతి చక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక. ఒక గోమతి చక్రాన్ని తాగే నీళ్ళలో ఉంచి, ఆ నీటిని త్రాగటం వలన, మనిషిలో రోగ నిరోధక శక్తి పెరిగి, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. గోమతి చక్రాన్ని లాకెట్ లాగా ధరిస్తే, నర దృష్టి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడా తొలగుతాయి.

[ ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? = ఈ వీడియో చూడండి: https://youtu.be/451l4ymbZFs ]

గోమతి చక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే 'నాగ చక్రం' అనీ, 'విష్ణు చక్రం' అని కూడా అంటారు. ఇది నత్త గుల్లని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని 'నత్త గుల్ల' స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగానూ ముందు భాగం ప్లాట్ గానూ ఉంటుంది. గోమతి చక్రం ముందు భాగం తెల్ల గానూ, కొన్ని ఎర్ర గాను ఉంటాయి. తెల్ల గా ఉన్న గోమతి చక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకీ, సకల కార్యసిద్ధికీ, ఆరోగ్య సమస్యలకీ, ధరించటానికి ఉపయోగ పడతాయి.

గోమతి చక్రాలు అరుదైన, సహజ సిద్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతి చక్రాలు, గుజరాత్ రాష్ట్రం, ద్వారకలోని గోమతీ నదిలో లభిస్తాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి, లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో, సోడియం లేదా కాల్షియం, లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి.. ఈ రెండు రాశులూ శుక్ర గ్రహానికి చెందినవి కావటం, ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన, ఈ చక్రాల ఉపయోగాలు అనేకం, అనంతం అని చెప్ప వచ్చును. జ్యోతిష్య శాస్త్ర రీత్యా, శుక్రుడు లైంగిక సామర్ధ్యానికీ, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకూ కారకత్వం వహిస్తుండటం వలన, గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

ఎర్రగా ఉన్న గోమతి చక్రాలు వశీకరణానికీ, శత్రు నాశనానికీ, క్షుద్ర ప్రయోగాలకీ, తాంత్రిక ప్రయోగాలకీ మాత్రమే ఉపయోగించాలి. గోమతి చక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి. సంఖ్యా శాస్త్రంలో ఆరు 'శుక్ర గ్రహానికీ', తొమ్మిది 'కుజ గ్రహానికీ' చెందుతాయి. జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు, ప్రేమలో విఫలం  కావటం, వివాహం అయిన తరువాత, రతికి ఆసక్తిని కనబర్చక పోవటం వంటి దోషాలు సైతం, గోమతి చక్ర ధారణ వల్ల నివారించ బడతాయి.

పూజా విధానం:

గోమతి చక్రాలను సిద్ధం చేసుకున్న తరువాత, వాటిని ముందుగా గంగా జలంతో గానీ, పసుపు నీళ్ళతో గానీ శుద్ధి చేసుకుని, పరిశుభ్రమైన బట్టతో తుడవాలి. గోమతి చక్రాలను శ్రీయంత్రం, లేదా అష్టలక్ష్మీ యంత్రం మీదగానీ, పీటం మీదగానీ ఉంచాలి. గోమతి చక్రాలను, లలితా సహస్త్ర నామం జపిస్తూ, కుంకుమతో గానీ హానుమాన్ సింధూరంతో గానీ అర్చన చేయాలి. గోమతి చక్రాల పూజ, శుక్రవారం రోజుగానీ, దీపావళి రోజుగానీ, వరలక్ష్మి వ్రతం రోజు గానీ చేసుకుని, మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు. పూజ చేసిన గోమతి చక్రాలను పూజా మందిరంలో గానీ, బీరువాలో గానీ ఉంచి, మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. గోమతి చక్రాలను ఎప్పుడూ ఎర్రని బట్టలో గానీ, హనుమాన్ సింధూరంలో గానీ ఉంచాలి. గోమతి చక్రాలను పిరమిడ్ లో గానీ వెండి బాక్స్ లో గానీ ఉంచి, కొద్దిగా హనుమాన్ సింధూరం, లేదా కుంకుమతో పాటు ఉంచాలి.

ఉపయోగాలు:

రెండు గోమతి చక్రాలను బీరువాలో గానీ పర్సులో గానీ ఉంచితే, ధనాభివృధ్ధి ఉండి, ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు. రెండు గోమతి చక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు క్రిందగానీ, దిండు క్రిందగానీ ఉంచినట్టయితే, వారిద్దరి మధ్యా ఎటువంటి గొడవలూ లేకుండా, అన్యోన్యంగా ఉంటారు. రెండు గోమతి చక్రాలను ఒక తెల్లని గుడ్డలో వేసి, దానిని మీ గుమ్మానికి కట్టండి, నరఘోష పటా పంచలై పోతుంది.

మూడు గోమతి చక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే, జనాకర్షణ, కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతి చక్రాల మీద రాసి, నీటిలో వేయటం గానీ, వాటిని వెంట పెట్టుకుని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే, అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే, ప్రయోజనం కలుగుతుంది.

నాలుగు గోమతి చక్రాలు పంట భూమిలో పొడిచేసి గానీ మాములుగా గానీ చల్లటం వలన, పంట బాగా పండుతుంది. గృహ నిర్మాణ సమయంలో, గర్భ స్ధానంలో నాలుగు గోమతి చక్రాలు భూమిలో స్ధాపించటం వలన, ఆ ఇల్లు త్వరిత గతిన పూర్తి చేసుకుని, అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయి. నాలుగు గోమతి చక్రాలను వాహనానికి కట్టటం వలన, వాహన నియంత్రణ కలిగి, వాహన ప్రమాదాల నుంచి నివారించ బడతారు.

ఐదు గోమతిచక్రాలు తరుచూ గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన, గర్భం నిలుస్తుంది. 5 గోమతి చక్రాలు, పిల్లలు చదుకునే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరుచూ ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి. పుత్ర ప్రాప్తి కోసం, 5 గోమతి చక్రాలను నది లోగానీ, జలాశయంలో గానీ విసర్జితం చేయాలి.

ఆరు గోమతి చక్రాలు అనారోగ్యం కలిగిన వ్యాధి గ్రస్తుడి మంచానికి కట్టటం వలన, తొందరగా ఆరోగ్యం కుదుట పడుతుంది. శత్రువులపై విజయం సాధించవచ్చును. కోర్టు గొడవలు ఉండవు. విజయం సాధించవచ్చును.

ఏడు గోమతి చక్రాలు ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.ఇతరులతో సామాజిక సంబంధాలు బాగుంటాయి. 7 గోమతి చక్రాలను నదిలో విసర్జిస్తే, దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు మటు మాయం అవుతాయి.

ఎనిమిది గోమతి చక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు. ఆద్యాత్మిక చింతన కలుగుతాయి. ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.

పది గోమతి చక్రాలు ఆఫీసులో ఉండటం వలన ఆ సంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించ బడతారు.

పదకొండు గోమతి చక్రాలు లాభ లక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. భవన నిర్మాణ సమయంలో పునాదిలో పదకొండు గోమతి చక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు, శల్య దోషాలు ఉండవు.

13 గోమతి చక్రాలను శివాలయంలో దానం చేస్తే, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. 27 గోమతి చక్రాలను వ్యాపార సముదాయాలలో ద్వార బంధానికి కట్టి, రాక పోకలు ఆ ద్వారం గుండా చేస్తే, వ్యాపారం దిన దినాభివృద్ధి అవుతుంది.

జాతక చక్రంలో నాగ దోషం, కాల సర్ప దోషం ఉన్న వారు, పంచమ స్ధానంలో ఉన్న రాహువుకి పాప గ్రహాల దృష్టి గానీ, సాంగత్యం గానీ ఉన్నా, సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతక చక్రంలో రాహు కేతువుల మధ్య అన్ని గ్రహాలూ ఉన్నప్పుడు, దానిని కాల సర్ప దోషం అంటారు. ఈ రెండు దోషాలూ ఉన్నవారు, గోమతి చక్రాలను పూజ చేయటం గానీ, దానం చేయటం గానీ, గోమతి చక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించటం గానీ చేయాలి.

Link: https://www.youtube.com/post/UgwkAPs9TRd2pt2zX5Z4AaABCQ

No comments: