ఆహారం తీసుకునే విధానం!
మన సనాతన ధర్మంలో ఆహారాన్ని తినేముందు, ఆ ఆహారన్ని భగవంతునికి నివేదన చేసిన తరువాత, 'ప్రసాదం' గా స్వీకరిస్తాం.. దేవాలయాలలో మరియు గృహాల్లోనూ, ప్రతిరోజూ వండిన పరార్ధాలు ముందుగా భగవంతునికి నివేదించబడతాయి.. ఆ నివేదింపబడిన పదార్థం, మిగతా పదార్ధాలతో కలిపి, ప్రసాదంగా వడ్డించబడుతుంది.. మన నిత్య పూజా కార్యక్రమంలో కూడా, భగవంతునికి మనం 'నైవేద్యం' సమర్పిస్తాం..
[ విదుర చరిత - మహాభారత కథ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/AGnQFCI51O0 ]
మనం నైవేద్యం ఎందుకు సమర్పిస్తాము? భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు.. భగవంతుడు పూర్ణుడై ఉండగా, మానవుడు అందులో అంశ మాత్రమే.. మనం ఏ పనైనా, భగవంతుడిచ్చిన శక్తీ, జ్ఞానమూ వలన మాత్రమే చేయగలుగుతున్నాము.. కావున, జీవితంలో మనం చేసే కర్మల ఫలితంగా, మనం పొందేదంతా, నిజానికి ఆయనదే.. ఈ విషయం గ్రహించి, ఆహారాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తాము.. భగవంతునికి అర్పించిన తర్వాత, అది ఆయన దివ్య స్పర్శనొంది, అనుగ్రహంతో, మనకిచ్చిన కానుకగా, మనచే స్వీకరించ బడుతుంది..
ఈ విషయం తెలుసుకున్న తరువాత, ఆహారం పట్లా, ఆహారం తినే విధానం పట్లా, మన వైఖరి పూర్తిగా మారుతుంది. సాధారణంగా, నివేదింపబడిన ఆహారం పవిత్రంగానూ, ఉత్తమమైనది గానూ ఉంటుంది. మనం దానిని స్వీకరించే ముందు, ఇతరులతో పంచుకుంటాం. మనం ఆహారాన్ని అధికార పూర్వకంగా అడగ కూడదు, అసంతృప్తి పడకూడదు. మనకు లభించిన ఆహారపు నాణ్యత గురించి విమర్శించ కూడదు. మనం దానిని సంతోషంగా, ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఈ విధంగా ప్రసాద భావన పెంపొందింప చేసుకుంటే, కేవలం ఆహారం పట్ల మాత్రమేగాక, మన జీవితంలో లభించే అన్నింటినీ ప్రసాదంగా, సంతోషంగా స్వీకరించ గలము..
ప్రతిరోజూ భోజనాన్ని పవిత్రం చేసే చర్యగా, కంచం చుట్టూ నీరు చల్లుతాము.. కంచం ప్రక్కగా, ఐదు ముద్దలను మనచేత చెల్లించబడే రుణాలకి ప్రతీకగా ఉంచుతాము..
1) దేవ ఋణం..
దేవతల దయార్ద్ర అనుగ్రహము, మరియు రక్షణలకు..
2) పిత్రు ఋణం..
పితృ దేవతలకి వంశ పారంపర్యత్వాన్నీ, మరియు సంస్కృతినీ ఇచ్చినందుకు..
3) భూత ఋణం..
ఎవరి ఆలంబన లేనిదే, ఈ సంఘంలో మనం జీవించాలేమో, ఆ సంఘాన్ని ఏర్పరచిన వారు..
4) రుషి ఋణం..
మన మతాన్నీ, మరియు సంస్కృతినీ గుర్తింపచేసి, వృద్ధి పరచి, తద్వారా మనకందించినందుకు..
5) మనుష్య ఋణం..
ఇతర ప్రాణులు స్వలాభాపేక్ష లేకుండా మనల్ని సేవిస్తున్నందుకు..
ఆ తర్వాత పంచ ప్రాణాలుగా, శరీరాన్ని నిలబెట్టే ప్రాణ శక్తిగా, మనలో ఉన్న భగవంతుడికి ప్రాణాయ స్వాహా.. అపానాయ స్వాహా.. వ్యానాయ స్వాహా.. ఉదానాయ స్వాహా.. సమానాయ స్వాహా.. అని చెబుతూ నివేదించబడుతుంది.. పంచ ప్రాణాలూ ఈ క్రింది విధంగా, శారీరక విధులు నిర్వహిస్తాయి..
1) ప్రాణము..
శ్వాస కొశమును చైతన్య వంతముగావిస్తుంది..
2) వ్యానము..
నాడీ వ్యవస్థను నియంత్రింపజేస్తుంది..
3) అపానము..
వ్యర్ధ పరార్ధాలను బయటకు త్రోస్తుంది..
4) సమానము..
జీర్ణ క్రియను చైతన్య వంతముచేసి, శరీరానికంతటికీ శక్తిని సరఫరా చేస్తుంది..
5) ఉదానము..
ఎక్కిళ్ళు, మొదలగునవి కల్గించేదీ.. ఆలోచనా శక్తి నిచ్చేదీ.. పై విధంగా నివేదించబడిన తరువాత, ఆహారం ప్రసాదంగా తీసికోబడుతుంది..
Link: https://www.youtube.com/post/Ugzwa12aka8fYG9qucx4AaABCQ
No comments:
Post a Comment