Ads

13 January, 2021

మకర సంక్రాంతి విశేషాలు! How to celebrate Sankranti?


రేపు అనగా '14 జనవరి 2021' గురువారం, సంక్రాంతి సందర్భంగా మకర సంక్రాంతి విశేషాలు!

ఖగోళ ప్రాముఖ్యత: 'సం' అంటే మంచి.. 'క్రాంతి' అంటే మార్పు.. 'సంక్రాంతి' అంటే, మంచి మార్పు అని అర్దం. అంతరిక్షం మొత్తాన్నీ 360° గా, 12 రాశులుగా విభజించింది, జ్యోతిష్య శాస్త్రం. సూర్యుడు ప్రతి రాశిలోకీ ప్రవేశించే సమయాన్నే, సంక్రమణం అంటారు. సూర్యుడు ఒక్కో రాశిలో, నెల రోజుల పాటు ఉంటాడు. అలా మనకు ఒక ఏడాదిలో, 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ప్రవేశించడమేంటి? అనే అనుమానం వస్తుంది. భూ భ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికీ సూర్యునికీ మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి, ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. నిజానికి సూర్యుడు ఎప్పుడూ తన స్థానంలోనే ఉంటాడు. ఈ విషయం, ఆధునిక సైన్సు చెప్పక ముందే, కొన్ని వేల ఏళ్ళ పూర్వమే, మన హిందువులకు తెలుసు. శథపధ బ్రాహ్మణం 'నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. భూమి తన చుట్టూ తాను తిరగడం వలన, పగలు రాత్రి ఏర్పడుతున్నాయి' అంటూ, చాలా స్పష్టంగా చెప్పింది.

[ సంక్రాంతికి ఇలా చేస్తే మీరు కోటీశ్వరులే! = ఈ వీడియో చూడండి: https://youtu.be/itjUnux5PEE ]

ఏడాదిలో 12 సంక్రాంతులూ ముఖ్యమే అయినా, అందులో మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం, ప్రధానమైనవి. మకర సంక్రాంతితో, ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఉత్తరాయణంలో భూమికీ, సూర్యునికీ మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఉత్తరాయణం, దేవతలకు పగలు. ఈ కాలంలోనే, ఎన్నో శుభకార్యాలు చేస్తారు. ఈ ఉత్తరాయణం, మకర సంక్రమణంతోనే మొదలవడంతో, ఇది పెద్ద పండుగ. ముఖ్యంగా సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన పండుగ.

విధులు: సంక్రాంతులలో పితృ దేవతలను పూజించాలి. వారికి తర్పణాలు వదలాలి. దీనివల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి, సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఈ రోజు ఉదయమే తల స్నానం చేసి, కొత్త బట్టలు ధరించాలి. గంగా, యమున, గోదావరి, సరస్వతీ నదులను స్మరించి, పుణ్యస్నానం చేయాలి. ఇష్ట దేవతలనూ, కుల దేవతలనూ, ఇల వేల్పులనూ, గ్రామ దేవతలనూ స్మరించాలి, పూజించాలి. పండుగ రోజునే కాదు.. ప్రతి రోజూ గోమాతను దర్శిస్తే, సకల శుభాలూ కలుగుతాయి. అలా కుదరని పక్షంలో, కనీసం సంక్రాంతులలోనైనా ఆవును (గోమాతను) దర్శించి, గ్రాసం తినిపించడం వలన, మంచిఫలితాలు వస్తాయి. అట్లాగే, సంక్రాతులలో శ్రీ విష్ణు, లలితా సహస్ర నామ పారాయణలు, మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ఆయుర్వేదం: సంక్రాంతి నాడు తప్పనిసరిగా నువ్వులు, బెల్లం తినాలి. దీని వెనుక ఆయుర్వేద రహస్యం ఉంది. నువ్వులు చలికాలంలో శరీరంలో ఏర్పడిన వాత దోషాన్ని తగ్గిస్తాయి. బెల్లం, నువ్వులను తినడం వలన, పైత్య దోషం కలగకుండా చేస్తుంది. అందుకే, సంక్రాంతి నాడు, తెలుగు వాళ్ళు అరిసెలు చేసుకుని తింటారు. తీపి తినండి, తియ్యగా మాట్లాడండి.. అనే అంతరార్ధం కూడా ఇందులో ఉంది.

దానాలకు గల ప్రాముఖ్యం.. సంక్రాంతి రోజు తప్పకుండా పెరుగు దానం చేయాలి. పెరుగు దానం చేయడం వలన, సంతాన సౌఖ్యం కలుగుతుంది. అధితి, కశ్యపులకు శ్రీ మహావిష్ణువు వామనుడిగా జన్మించగానే, పెరిగి 6 ఏళ్ళ బాలుడయ్యడు. వారికి సంతాన సౌఖ్యం కలుగలేదు. మరుజన్మలో శ్రీ రాముడిగా విష్ణువు, కౌసల్య, దశరధులుగా అధితి కస్యపులు జన్మించారు. కాని రాముడు వనవాసానికి వెళ్ళడం, ఆ బాధతో దశరధుడు మరణించడం, కౌసల్య 'నువ్వు పుట్టక పొయినా బాగుండును' అని రాముడిని అనడం జరిగింది. వారికి అప్పుడు కూడా పుత్ర సౌఖ్యం లేదు.

కృష్ణవతారంలో, అధితి కశ్యపులు, దేవకి, వసుదేవులుగా జన్మించగా, పుట్టగానే వారికి దూరమైనాడు కృష్ణుడు. వారికి సంతానసౌఖ్యం లభించలేదు. కృష్ణుడికి కూడా సంతానం కలిగినా, వారి వల్ల ఆయనకు సంతాన సౌఖ్యం కలుగలేదు. వారికి గొప్ప పేరు కూడా రాలేదు. యశోద పెరుగు దానం చెసింది. అందుకే శ్రీ కృష్ణ పరమాత్మ వలన, సంతాన సౌఖ్యం పొందింది. ఇందులో నందుడు పాలుపంచుకోలేదు. కనుక ఆయన కృష్ణతత్వాన్ని అనుభవించలేకపోయాడు. అందువల్ల, సంక్రాంతి రోజు పెరుగు దానం చేయడం వలన, సంతానం వల్ల సుఖం, ఆనందం కలుగుతుంది. సంతానం కలిగినవారు, పెరుగు దానం చేయడం వలన, పుట్టిన సంతానానికి సద్బుద్ధి కలుగుతుందనీ, అలాగే సంక్రాంతి రోజున, కూష్మాండం (గుమ్మడి కాయ) దానం చేయాలి.

సంక్రాంతికీ పితృదేవతలకూ సంబంధం ఉంది.. రేపు సంక్రాంతి సందర్భంగా, తప్పక చదవాల్సిన, వినాల్సిన పితృ దేవతా స్తుతి..

శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే, పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు.. పితృ కృప చేత, ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి, శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడినది. ఇందులో అన్ని పితృగణాలూ, వాటి విశేష రహస్యాలూ చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు, పితృ దేవతలు. వారి అనుగ్రహం వలన, వంశవృద్దీ, ఐశ్వర్య క్షేమాలూ సమకూరుతాయి.

నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!

దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః!!

నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!

శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!

నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!

శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!

నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!

తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!

నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!

శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!

నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!

వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!

నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!

యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!

కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!

నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!

స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!

సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!

సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!

భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!

తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!

పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!

తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!

పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!

యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!

పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!

ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!

తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!

సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!

సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!

తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!

యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!

యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!

యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!

కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!

కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!

తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!

దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!

యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!

పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|

తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!

తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!

తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!

యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!

తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!

రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!

ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!

అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!

వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!

అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!

తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!

ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!

రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!

సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!

విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!

భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!

కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!

కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!

వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!

విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!

మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!

గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!

సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!

పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!

ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!

త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!

మార్కండేయ ఉవాచ..

ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః!

ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!

తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!

జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!

రుచిరువాచ..

అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!

నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!

ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!

సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!

మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!

తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!

నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!

ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!

ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!

యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!

నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!

స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!

సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!

నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!

అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!

అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!

యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!

జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!

తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!

నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!

మార్కండేయ వువాచ..

ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!

నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!

నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!

తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!

ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!

నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!

స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!

తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!

ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!

వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!

శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!

పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!

స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!

అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!

యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!

సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!

తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!

శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!

రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం, నిత్యం పఠించవచ్చు. అందరికీ మరోసారి 'సంక్రాంతి శుభాకాంక్షలు'..

Link: https://www.youtube.com/post/UgxSWLgSQpT5m7dzc-h4AaABCQ

No comments: