Ads

08 December, 2020

కాల భైరవ అష్టమి! Kala Bhairavashtami


 కాల భైరవ అష్టమి!

మహా కాలభైరవి అష్టమి.. కార్తీక మాసంలో వచ్చింది. ఈ కాలభైరవ అష్టమి అంటే కాలభైరవ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. సాక్షాత్ పరమ శివుని అవతారం కాలభైరవుడు. ఈ స్వామి వాహనం శునకం (కుక్క) అందుచేత ఈ రోజును కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు. ఈ భైరవ అవతారానికి గల ఒక కారణం ఉంది అని పెద్దలు చెబుతారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మ , విష్ణువు మధ్య వివాదాంశం తలెత్తింది. విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు.. పరతత్వం ఎవరు.. అని ఇది చర్చకు దారి తీసింది..

[ కాల భైర‌వుని ఆవిర్భావం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/E_-ldokW73M ]

అప్పుడు మహర్షులు ఇలా చెప్పారు.. సమస్త విశ్వానికీ మూలమైన పరతత్వం, తెల్చిచెప్పాడానికి వీలుకానిది ఈ సమస్య. దీనికి కారణం, మీరిద్దరూ ఆ శక్తి విభూతి నుండే ఏర్పడిన వారే కదా.. అన్నారు ఋషులు. ఈ వాదనను అంగీకరించిన శ్రీ మాహావిష్ణువు మౌనం వహించాడు. కానీ, బ్రహ్మ అందుకు అంగీకరించలేదు. ఆ పరతత్వం మరెవరోకాదు, నేనే అని బ్రహ్మ అహం ప్రదర్శించాడు. అప్పుడు వెంటనే పరమశివుడు భైరవ స్వరూపాన్ని చూపి, బ్రహ్మకు గర్వభంగం కలిగించాడు. ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు, మార్గశిర మాస శుద్ధ అష్టమి కావటంతో, 'కాలభైరవాష్టమి' గా ప్రసిద్ధి చెందింది.

మన పురాణాల ప్రకారం రౌద్ర స్వరూపుడు..

1) శంబర భైరవుడు,

2) అసితాంగ భైరవుడు,

3) రురు భైరవుడు,

4) చండ భైరవుడు,

5) క్రోథ భైరవుడు,

6) ఉన్మత్త భైరవుడు,

7) కపాల భైరవుడు,

8) భీష్మ భైరవుడు.. అని ఎనిమిది రకాలు.

వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.

ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకర ఆకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. దుష్ట గ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు రక్షాదక్షుడు ఈ కాలభైరవుడు. కాలస్వరూపం తెలిసిన వాడు. కాలం లాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు.

భక్తిశ్రద్ధలతో కొలిచే వారు "ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌" అని ప్రార్థిస్తారు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.

కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీ క్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు.

దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి. కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు అని అర్ధం. మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాక విదేశాలలోను కాలభైరవస్వామి దేవాలయాలు చాలానే ఉన్నాయి..

Link: https://www.youtube.com/post/Ugwc1lVUpBmaR4Hl1SB4AaABCQ

No comments: