Ads

22 March, 2019

దంపతులు - ఆది దంపతులు


దంపతులు - ఆది దంపతులు

శివపార్వతుల కళ్యాణానికి వెళ్లిన ఓ ముసలి ముత్తయిదువ, పక్కన కూర్చున్న పేరంటాలితో గుసగుసగా ఈ మాటలు అంది...

ఇదేం విడ్డూరం అమ్మాయ్!

పార్వతి దేవి ఎండకన్నెరుగని పిల్ల,

పరమేశ్వరుడేమో ఎండలో ఎండిపోతూ, వానలో తడిసిపోతూ, శ్మశానాల్లో బతికే రకం!

ఆమె తనువంతా సుగంధ లేపనాలు,

అతడి శరీరమంతా బూడిద గీతలు.

ఆమె చేతులకు వంకీలు,

అతడి చేతులకు పాము పిల్లలు.

ఎక్కడా పొంతనే లేదు. చూస్తూ ఉండు. నాలుగు రోజులైతే పెళ్ళి పెటాకులవుతుంది! అంది...

నాలుగు రోజులు కాదు, నాలుగు యుగాలు గడిచిపోయాయి...

కానీ వారు...

ఆదిప్రేమికులు, ఆదిదంపతులుగా వర్ధిల్లుతూనే ఉన్నారు. 

"బయటికి కనిపించే రూపాన్ని కాదు...

శివుని అంతః సౌందర్యాన్ని చూసింది పార్వతి దేవి"

అతడు విష్ణువు అయితే, ఆమె లక్ష్మీ దేవీ...

అతడు సూర్యడైతే, ఆమె నీడ...

అతడు పదం అయితే, ఆమె అర్థం...

అలా అని ఆ దంపతుల మధ్య విభేదాలు రాలేదా?

అంటే, వచ్చాయి...

ఆ కాపురంలో సమస్యలు తలెత్తలేదా?

అంటే, తలెత్తాయి...   

ప్రతి సమస్య తర్వాత, ఆ బంధం మరింత బలపడింది...

ప్రతి సంక్షోభం ముగిశాక, ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు...

ఏ ఆలుమగలైనా, పట్టువిడుపుల పాఠాల్ని శివపార్వతుల నుంచే నేర్చుకోవాలి!

ఒకసారి శివుడు మాట చెల్లించుకుంటే, మరోసారి పార్వతి పంతం నెగ్గించుకుంది!

మధురలో అమ్మవారిదే పెత్తనం! సుందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మ కు మొగుడే. 

నైవేద్యాలు కూడా దొరసానమ్మకు నివేదించాకే దొరవారికి...
               
అదే చిదంబరంలో, నటరాజస్వామి మాటే శాసనం... శివకామసుందరి తలుపుచాటు ఇల్లాలు...
 
ఒక్క మధురై, ఒక్క చిదంబరం ఏంటి! ఇలా ఎన్నోచోట్ల భార్య పెత్తనం...

అలానే భర్త పెత్తనం మరి కొన్నిచోట్ల...

అందుకే.., జగత్తునేలే ఆదిదంపతులయినారు పార్వతీపరమేశ్వరులు...🙏

అందుకే ఏ జంటను దీవించాలన్నా ..,

పార్వతి పరమేశ్వరులలాగా కలకాలం ఉండండి అని దీవిస్తారు...

🙏 శంభో శంకర 🙏

No comments: